న్యూ ఇయర్‌ క్రేజీ ఆఫర్‌.. అదిరే ఫీచర్లున్న ఈ రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు!

26 Dec, 2022 21:31 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమీ ఇండియా ఇటీవలే రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G) స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదల సంగతి తెలిసిందే.  తాజాగా తన కస్టమర్లకు న్యూ ఇయర్‌ ఆఫర్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెండు వేరియంట్లపై రూ.1,000 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం  Mi.com, అమెజాన్‌ (Amazon)లో వెయ్యి రుపాయలు తగ్గింపు ధరతో...  4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.14,999 ధరగా ఉంది.

అంతకుముందు ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. Redmi Prime 5Gలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

ఇది డిస్ప్లేలో వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే నాచ్‌ను కలిగి ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండగా 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5వాట్ ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. పవర్‌ఫుల్ నైట్ విజన్, పోర్ట్‌రైట్ మోడ్, మూవీ ఫ్రేమ్, షార్ట్ వీడియో, టైమ్ ల్యాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మెడో గ్రీన్, థండర్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది.

అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లు ద్వారా ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,000 తగ్గింపు ఇస్తుండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసిన కొనుగోళ్లకు 750 తక్షణ తగ్గింపు అందిస్తోంది.  అమెజాన్‌ నుంచి ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.2,000 నుంచి ప్రారంభం అవుతుంది.

మరిన్ని వార్తలు