రెడ్‌మీ యూజర్లకు షాక్‌... ధరలు పెరిగే మోడల్స్‌ ఇవే

5 Jul, 2021 12:56 IST|Sakshi

ఇప్పటికే రెడ్‌మీ నోట్‌ 10, నోట్‌ 10 ప్రో ధరల పెంపు

రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌ ధరల పెంపుకు నిర్ణయం 

ఇండియాలో మెస్ట్‌ పాపులర్‌ మొబైల్‌ బ్రాండ్‌ షావోమీ తన యూజర్లకు వరుసగా షాక్‌లు ఇస్తోంది. రన్నింగ్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్ల ధరలు ఒకదాని తర్వాత ఒకటిగా పెంచుకుంటూ పోతుంది. జూన్‌లో ధరల పెంపుకు తెర తీసిన షావోమీ.. అదే ట్రెండ్‌ని జులైలోనూ కంటిన్యూ చేస్తోంది. 

విడిభాగాల వల్లే
షావోమీ సంస్థ గత మార్చ్‌లో రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌ని రిలీజ్‌ చేసింది. ఆ వెంటనే నోట్‌ 10 ప్రో, నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌ వేరియంట్లు రిలీజ్‌ చేసింది. ఈ మోడల్స్‌ సక్సెస్‌ఫుల్‌గా అమ్మకాలు సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా జూన్‌లో నోట్‌ 10, నోట్‌ 10 ప్రో ధరలను పెంచింది. ర్యామ్‌, స్టోరేజీ కెపాసిటీ ఆధారంగా రూ. 500ల నుంచి రూ. 1000 వరకు ధరలు పెంచేసింది. ఫోన్‌ తయారీలో ఉపయోగించే చిప్‌సెట్‌, డిస్‌ప్లే, డిస్‌ప్లే డ్రైవర్‌, బ్యాక్‌ప్యానెల్‌, బ్యాటరీ తదితర విడిభాగాల ధరలు పెరిగినందువల్లే తమ మొబైల్‌ ఫోన్ల ధరలు పెంచుతున్నట్టు షావోమీ ప్రకటించింది.

పెంపు ఎంతంటే
నోట్‌ 10 సిరీస్‌లో హై ఎండ్‌ వేరియంట్‌ అయిన నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌ ధర పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌ 64 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్‌ ధర రూ. 18,990 ఉండగా, 6 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజీ మోడల్‌ ధర రూ. 20 వేల దగ్గర ఉంది. హై కెపాసిటీ కలిగిన 8 జీబీ 128 స్టోరేజీ మోడల్‌ ధర రూ. 23,944గా ఉంది. ఈ మూడు వేరియంట్లలో ముందుగా 6 జీబీ 128 స్టోరేజీ మోడల్‌ ధర పెంపుకు సిద్ధమైంది. వీటితో పాటు మిగిలిన రెండు వేరియంట్లకు కూడా ధరల పెంపు తప్పదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరల పెంపు కనీసం రూ. 500ల నుంచి రూ. 1,500ల వరకు ఉండొచ్చని సమాచారం. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు