Redmi Fire TV: కొత్త ఓఎస్‌తో, కొత్త కొత్తగా వచ్చేస్తోంది!

4 Mar, 2023 15:47 IST|Sakshi

సాక్షి,ముంబై:బడ్జెట్‌ ధరల స్మార్టఫోన్లు, స్మార్ట్ టీవీలతో ఆకట్టుకున్న చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమికి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ టీవీని తీసుకొచ్చింది. ఇండియన్‌ మార్కెట్‌లో తొలిసారిగా ఫైర్ ఓఎస్‍తో సరికొత్త టీవీని పరిచయం చేసింది. ఈమేరకు షావోమీ ట్విటర్‌లో  షేర్‌ చేసింది. 

రెడ్‌మీ ఫైర్ స్మార్ట్  టీవీ ఈ నెల  (మార్చి) 14వ తేదీన లాంచ్ కానుంది. అమెజాన్‍కు చెందిన ఫైర్ ఓఎస్ 7 (Fire OS7)పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. రెడ్‍మీ ఫైర్ టీవీని లాంచ్‌ కోసం మైక్రోపేజీని క్రియేట్ చేసింది.  అమెజాన్ భాగస్వామ్యంతో ఈ టీవీని షావోమీ రూపొందించింది. అమెజాన్‍ ద్వారా ఈ టీవీ అందుబాటులోకి  రానుంది.

రెడ్‌మీ ఫైర్ టీవీ   ఫీచర్లు, అంచనాలు 
రెడ్‍మీ ఫైర్ టీవీ బెజిల్‍లెస్ డిజైన్‍, క్వాడ్-కోర్ ప్రాసెసర్, మెటాలిక్ బాడీ
డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ 
ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టాబ్లెట్‌ టీవీ స్క్రీన్ కాస్టింగ్‌ కోసం  మిరాకాస్ట్, 
యాపిల్ ఎయిర్ ప్లే , అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ ప్రధాన  ఫీచర్లుగా ఉండనున్నాయి.

మరోవైపు  ప్రపంచవ్యాప్తంగాఫైర్ ఓఎస్‍తో గ్లోబల్‍గా ఇటీవల షావోమీ ఎఫ్‍2  సిరీస్లో కొన్ని  టీవీలను లాంచ్‌ చేసింది.  4K అల్ట్రా స్క్రీన్ రిజల్యూషన్, 43, 50, 55 అంగుళాల సైజుల్లో మెటల్ యూనీబాడీ డిజైన్‌తో వీటిని రూపొందించినట్టు తెలుస్తోంది.  ఇక ధర,  ఇతర స్పెషికేషన్లపై  లాంచింగ్‌ తరువాత మాత్రమే క్లారిటీ  రానుంది.


 

మరిన్ని వార్తలు