రెడ్ మీ లవర్స్‌కు శుభవార్త..!

3 Feb, 2021 16:43 IST|Sakshi

గత రెండేళ్ల నుంచి షియోమీ భారతదేశంలో స్మార్ట్ టీవీ మార్కెట్‌ను రోజు రోజుకి ఆక్రమించుకుంటూ పోతుంది. ఇప్పటికే ఈ సంస్థ భారతదేశంలో అనేక స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. చివరగా 2020 డిసెంబర్ లో ఎంఐ క్యూఎల్‌ఇడి 4కే టీవీని విడుదల చేసింది. ఇప్పుడు 2021లో రెడ్ మీ బ్రాండ్ పేరుతో మరొకొన్ని టెలివిజన్లను మార్కెట్లోకి తీసుకోని రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చైనాలో రెడ్ మీ పేరుతో షియోమీ స్మార్ట్ టీవీలను విక్రయిస్తోంది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఇదే విధంగా చేయాలని చూస్తోంది. ఈ సమాచారాన్ని టిప్‌స్టెర్ ముకుల్ శర్మ షేర్ చేశారు. రెడ్ మీ టీవీలు తక్కువ ధరతో మార్చిలో విడుదల కానున్నట్లు సమాచారం. అయితే భారత్ లో విడుదల చేయబోయే మోడళ్లపై ఎటువంటి స్పష్టత లేదు. చైనాలో 2020లో విడుదల చేసిన 50-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల పరిమాణాల్లో గల రెడ్ మీ ఎక్స్50 సిరీస్ టీవీలను ఇండియాలో తీసుకొనిరావడానికి రెడ్ మీ చూస్తున్నట్లు సమాచారం. (ఇక వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి)

రెడ్ మీ ఎక్స్50 సిరీస్ ఫీచర్స్:
రెడ్ మీ స్మార్ట్ టీవీ స్క్రీన్ టు బాడీ రేషియో 97 శాతంగా ఉంది. ప్రస్తుతం ఎంఐ టీవీ 4మోడళ్లలో ఉన్న ప్లాస్టిక్ ఫ్రేమ్‌కు బదులుగా ఇవి మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి. 50, 55, 65 అంగుళాల టీవీలో 4కే అల్ట్రా హెచ్ డీ స్క్రీన్లను వీటిలో అందించారు. 60 హెర్ట్జ్ మోషన్ ఎస్టిమేషన్, ఎంఈఎంసీ వంటి ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం. వీటిలో 8 యూనిట్ సౌండ్ సిస్టం కూడా అందుబాటులో ఉంది. డాల్బీ ఆడియో, డీటీఎస్ హెచ్ డీ టెక్నాలజీలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఫీల్డ్ వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంది. వీటిలో క్వాడ్ కోర్ ప్రాసెసర్ ను అందించారు. 32 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. వీటిలో డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఇన్ ఫ్రారెడ్, మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, ఒక ఏవీ కనెక్టర్, ఒక డీటీఎంబీ కనెక్టర్, రెండు యూఎస్ బీ పోర్టులు, ఒక ఎథర్ నెట్ పోర్టు, ఒక ఎస్/పీడీఐఎఫ్ కనెక్టర్ లను ఇందులో అందించారు.(చదవండి: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ షాక్!)

రెడ్ మీ ఎక్స్50 సిరీస్ ధర:
చైనాలో ఎక్స్50 బేస్ మోడల్ టివి ధర సిఎన్‌వై1999(సుమారు రూ.21,000) ఉండగా ఎక్స్55 టివి ధర సిఎన్‌వై 2,299(సుమారు రూ.24,400)గా ఉంది. ఇక టాప్-ఆఫ్-ది-లైన్ రెడ్‌మి స్మార్ట్ టివి ఎక్స్65 ఖరీదు సిఎన్‌వై 3,299(సుమారు రూ.35,000)కు అందుబాటులో ఉంది. 
 

మరిన్ని వార్తలు