లీకైన రెడ్‌మీ నోట్ 10 సిరీస్ ధర, చిత్రాలు

3 Mar, 2021 17:22 IST|Sakshi

రెడ్‌మీ నోట్ 10 సిరీస్ మొబైల్ రేపు (మార్చి 4) మనదేశంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ లో మూడు ఫోన్‌లు తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రీమియం రేంజిలో రెడ్‌మీ నోట్ 10 ప్రో మాక్స్, మిడ్-రేంజ్ లో రెడ్‌మీ నోట్ 10 ప్రో, బడ్జెట్ రేంజిలో వనిల్లా రెడ్‌మీ నోట్ 10 తీసుకోని రావొచ్చు. అయితే విడుదలకు ఒక రోజు ముందు రెడ్‌మీ నోట్ 10 సిరీస్ లాంచ్, రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో ధర లీకైంది. రెడ్‌మీ నోట్ 10 భారతదేశం ధర ఆన్‌లైన్‌లో లీక్ కాగా, రెడ్‌మీ నోట్ 10 ప్రో గ్లోబల్ లాంచ్ ధర కూడా బయటకు వచ్చేసింది.

యూట్యూబర్ సిస్టెక్ బన్నా ఒక వీడియోలో రెడ్‌మీ నోట్ 10 ధరతో పాటు రిటైల్ బాక్స్ చిత్రాన్ని లీక్ చేశారు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. 6జీబీ + 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ.15,999గా ఉంది. అయితే, సాధారణంగా రిటైల్ బాక్స్ ధర కంటే ఫోన్ సేల్ ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని ధర రూ.13,999 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఇంకా తక్కువ ధర కలిగిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఇందులో తీసుకొచ్చే అవకాశం ఉంది.

అలాగే టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్.. 6జీబీ + 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ గ్లోబల్ రెడ్‌మీ లాంచ్ ధర 279 యూరోలుగా(సుమారు రూ.20,400) ఉండే అవకాశం ఉందని తెలిపారు. గతంలో వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు తీసుకోని రానున్నారు. వీటి ధర లీక్ చేయలేదు. రెడ్‌మి నోట్ 10 ప్రో మొబైల్ డార్క్ నైట్, గ్లేసియర్ బ్లూ, గ్రాడియంట్ బ్రాంజ్, వింటేజ్ బ్రాంజ్, ఓనిక్స్ గ్రే రంగుల్లో తీసుకోని రావచ్చు. అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉన్న ఫోన్ రెడ్ మీ ఈ ధరలోనే అందిస్తూ ఉండటం విశేషం. ఇందులో 120 హెర్ట్జ్ ఐపీఎస్ డిస్ ప్లే, బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంఏహెచ్ ఉండనుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు సమాచారం. 

చదవండి:

గ్రాహంబెల్ జయంతి: టెలిఫోన్లలో ఎన్ని రకాలొచ్చాయి?

భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం 

>
మరిన్ని వార్తలు