అతి తక్కువ ధరకే షావోమీ నుంచి 5జీ ఫోన్‌...!

20 Jul, 2021 20:32 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ మొబైళ్ల తయారీ సంస్థ షావోమీ భారత మార్కెట్‌లోకి  రెడ్‌మీ నోట్ 10టీ 5జీను  మంగళవారం రోజున లాంచ్‌ చేసింది. షావోమి నుంచి రెడ్‌మీ బ్రాండ్‌తో భారత్‌లో రిలీజైన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌. రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌ నుంచి వచ్చిన ఐదో ఫోన్‌ రెడ్‌మీ నోట్‌ 10టీ 5జీ. రెండు రకాల స్టోరేజ్‌ వేరియంట్‌తో ఫోన్లను లాంచ్‌ చేశారు. క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ,  మింట్ గ్రీన్ కలర్‌ వేరియంట్లతో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. రెడ్‌మీ నోట్ 10టీ 5జీ (4 జీబీ + 64 జీబీ స్టోరేజ్) వేరియంట్‌ ధర రూ.13,999 ఉండగా, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 15,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను జూలై 26 నుంచి అమెజాన్ , ఎమ్‌ఐ.కామ్‌, ఎమ్‌ఐ హోమ్ స్టోర్స్ నుంచి పొందవచ్చును. మొబైల్‌ను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ వర్తిస్తుంది.

రెడ్‌ మీ 10టీ 5జీ ఫీచర్లు 

  • 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి ప్లస్ హోల్-పంచ్ డిస్ ప్లే
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12
  • మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 
  • 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
  • 48 ఎంపీ మెయిన్ కెమెరా + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 
  • 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 
  • 18వాట్స్‌ ఫాస్ట్ చార్జర్ 
  • 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు