త్వరలో ఇండియా మార్కెట్లోకి రెడ్‌మీ నోట్ 10టీ!

6 Jul, 2021 20:13 IST|Sakshi

రెడ్‌మీ నోట్ 10టీ త్వరలో భారతదేశంలో లాంఛ్ సిద్దంగా ఉన్నట్లు అమెజాన్‌లో టీజ్ చేసింది. ఇటీవలే రెడ్‌మీ నోట్ 10 5జీని పోకో ఎం3 ప్రో 5జీగా భారత మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పుడు, నోట్ 10టీ మోడల్ కూడా భారతదేశానికి వస్తున్నట్లు కనిపిస్తోంది. పోకో ఎమ్3 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్ 10టీ, రెడ్‌మీ నోట్ 10 5జీ ఒకే విధమైన స్పెసిఫికేషన్లు కలిగి ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 10టీని గత నెలలో రష్యాలో మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ స్పెసిఫికేషన్లతో వచ్చింది.

ఈ ఫోన్ ఎలా ఉంటుందో టీజర్ లో స్పష్టంగా వెల్లడించనప్పటికీ, రెడ్‌మీ తీసుకొని రాబోయే మొబైల్ 'వేగంగా, ఫ్యూచరిస్టిక్ గా' ఉంటుందని టీజర్ లో పేర్కొంది. భారతీయ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారో అనే దానిపై ఖచ్చితమైన  తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ 4జీబీ + 128జీబీ స్టోరేజ్ మోడల్ సుమారు రూ.20,500కు తీసుకొని రావచ్చు. దీనిని బ్లూ, గ్రీన్, గ్రే, సిల్వర్ రంగులలో తీసుకొని రావచ్చు. 

రెడ్‌మీ నోట్ 10టీ ఫీచర్స్

  • 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి ప్లస్ హోల్-పంచ్ డిస్ ప్లేను 
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12
  • మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 
  • 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
  • 48 ఎంపీ మెయిన్ కెమెరా + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 
  • 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 
  • 18డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ 
  • 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 

మరిన్ని వార్తలు