చక్కెర ఉత్పత్తిని తగ్గించండి..లేకపోతే భారీ నష్టం: నితిన్‌ గడ్కరీ

20 Mar, 2022 19:24 IST|Sakshi

దేశంలోని చక్కెర, అనుబంధ పరిశ్రమలకు చక్కెర ఉత్పత్తి తగ్గించాలని  కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గట్టి వార్నింగ్‌ను ఇచ్చారు. దేశ అవసరాలకు తగ్గట్గుగా చక్కెరను ఇథనాల్‌గా మార్చాలని చక్కెర పరిశ్రమలకు గడ్కరీ పిలుపునిచ్చారు. 

ఉత్పత్తి తగ్గించండి..!
ఆదివారం ముంబైలో జరిగిన షుగర్ అండ్‌ ఇథనాల్ ఇండియా కాన్ఫరెన్స్ (ఎస్‌ఈఐసీ)-2022లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రసంగిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చక్కెర పరిశ్రమల ఉత్పత్తి ఇలాగే  కొనసాగితే రానున్న కాలంలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. పలు ధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ మిగులు దేశంగా ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. కాలానికి అనుగుణంగా, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చక్కెర ఉత్పత్తిని తగ్గిస్తూ..ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచాలని చక్కెర పరిశ్రమలకు మంచిదని సూచించారు. 

ఫ్లెక్స్‌ ఫ్యుయల్స్‌ కోసం..!
ఫ్లెక్స్‌ ఫ్యుయల్‌ వాడకంతో ఇంధన ధరల నుంచి ఉపశమనం కలుగుతుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే టయోటా, హ్యుందాయ్‌, సుజుకీ వచ్చే ఆరు నెలల్లో ఫ్లెక్స్‌ ఇంజిన్‌ వాహనాలను తెచ్చేందుకు సిద్దంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఇథనాల్‌ బయో ఫ్యుయల్‌ అవుట్‌లెట్లను తెరిచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరలను ఫ్లెక్స్‌ ఫ్యుయల్‌ వాడకంతో చెక్‌ పెట్టవచ్చునని గడ్కరీ వెల్లడించారు. 

చదవండి: బీఎస్‌ఎన్‌ఎన్‌లో ఆ సంస్థ పూర్తిగా విలీనం..! మలుపు తిప్పే అవకాశం..!

>
మరిన్ని వార్తలు