Reliance AGM: రేపే సమావేశం..భారీ ఒప్పందాలు..ఆఫర్లు..!

23 Jun, 2021 17:40 IST|Sakshi

ముంబై: ప్రతి సంవత్సరం జరిగే రిలయన్స్‌ కంపెనీ వార్షిక వాటాదారుల మీటింగ్‌(AGM) జూన్‌ 24 గురువారం రోజున ముంబైలో జరగనుంది. రిలయన్స్‌ ఏర్పాటు చేసే  ఏజీఎం మీటింగ్‌పైనే అందరీ దృష్టి. ఈ సమావేశంలో పలు అంశాలపై రిలయన్స్‌ భారీ ప్రకటనలు చేస్తోందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. గూగుల్‌-జియో సంయుక్తంగా అతి తక్కువ ధరకే 5జీ మొబైల్‌ ఫోన్‌ను ఈ సమావేశంలో లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.  

గూగుల్‌ కంపెనీ  గత సంవత్సరం రిలయన్స్‌ జియోలో సుమారు రూ. 33, వేల 737 కోట్లను ఇన్వెస్ట్‌ చేసింది. తాజాగా 44వ ఏజీఎం మీటింగ్‌లో అతి తక్కువ ధరకే జియో బుక్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏజీఎం మీటింగ్‌లో భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. సౌదీకు చెందిన ఆరాంకో కంపెనీతో సుమారు 15 బిలియన్‌ డాలర‍్లతో భారీ ఒప్పందం జరగుతుందని వ్యాపార నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆరాంకో కంపెనీ చైర్మన్‌ యాసిర్‌ అల్‌ రుమయ్యన్‌ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. 

రిలయన్స్‌ 44వ ఏజీఎం సమావేశం జూన్‌ 24 మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యక్షప్రసారం కానుంది. ఈ సమావేశంలో రిలయన్స్‌ చైర్మన్‌ ముకేష్‌ అంబానీ పలు అంశాలపై మాట్లాడతారు. అంతేకాకుండా జియో 5జీ, జియో బుక్‌ ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేయనున్నుట్లు తెలుస్తోంది. ఈ సమావేశాన్ని జియో మీట్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. 

చదవండి: ప్రాథమిక హక్కులుగా కనెక్టివిటీ, కమ్యూనికేషన్‌

మరిన్ని వార్తలు