మహీంద్రా ఈ–ఎస్‌యూవీలకు జియో–బీపీ చార్జింగ్‌ నెట్‌వర్క్‌

12 Oct, 2022 09:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ప్రవేశపెట్టబోయే ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీల కోసం చార్జింగ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జియో–బీపీ వెల్లడించింది. ముందుగా 16 నగరాల్లో ఎంఅండ్‌ఎం డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌లు, వర్క్‌షాప్‌లలో డీసీ ఫాస్ట్‌ చార్జర్లను ఇన్‌స్టాల్‌ చేయనున్నట్లు తెలిపింది.

ఎంఅండ్‌ఎం ఇటీవలే తమ తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ – ఎక్స్‌యూవీ400ను ఆవిష్కరించింది. త్వరలో మరిన్ని వాహనాలను ప్రవేశపెట్టనుంది. దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌–బ్రిటన్‌కు చెందిన బీపీ కలిసి ఇంధనాల రిటైలింగ్‌ కోసం జాయింట్‌ వెంచర్‌గా జియో–బీపీని ఏర్పాటు చేశాయి.    

మరిన్ని వార్తలు