Ayodhya Ram Mandir Consecration: సోమవారం వేతనంతో కూడిన సెలవు.. అంబానీ కీలక ప్రకటన

20 Jan, 2024 13:04 IST|Sakshi

అయోధ్యలో జనవరి 22వ తేదీన బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ నిర్ణయానికి మద్ధతుగా ప్రతిష్టాత్మక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ అదే బాటలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని అన్ని కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించారు.

జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు అంబానీ వెల్లడించారు.

ఇదీ చదవండి: రిలయన్స్‌ లాభం 17,265 కోట్లు

దీంతో జనవరి 22వ తేదీన తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ షోరూంలు, ఇతర రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులకు వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించారు. ముఖేష్ అంబానీ సోమవారం అయోధ్యలో జరిగే కార్యక్రమంలో ఫ్యామిలీతోపాటు హాజరుకానున్నట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు