తుది దశకు రిలయన్స్‌ క్యాప్‌ బిడ్డింగ్‌

14 Apr, 2022 05:40 IST|Sakshi

వచ్చే వారం ఆర్‌ఎఫ్‌ఆర్‌పీకి గ్రీన్‌సిగ్నల్‌!

న్యూఢిల్లీ: రిలయన్స్‌ క్యాపిటల్‌ రుణదాతలు రుణపరిష్కార(రిజల్యూషన్‌) ప్రణాళిక అభ్యర్థన పత్రాల(ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ)పై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో తుది అనుమతి కోసం వచ్చే వారం ఆర్‌ఎఫ్‌ఆర్‌పీని రుణదాతల కమిటీ(సీవోసీ) ముందుంచవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిజల్యూషన్‌ ప్రణాళిక దాఖలు, విలువ మదింపు తదితర అంశాలలో ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ డాక్యుమెంట్‌ మార్గదర్శకంగా నిలవనుంది. రిజల్యూషన్‌ ప్రణాళికను రిలయన్స్‌ క్యాపిటల్‌ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం చేసిన(ఈవోఐ) కంపెనీలన్నిటికీ అందించనున్నారు.

తద్వారా తుది బిడ్స్‌ దాఖలుకు వీలుంటుంది. బుధవారం సమావేశమైన సీవోసీ ఆర్‌ఎఫ్‌ఆర్‌పీని అనుమతించినట్లు తెలుస్తోంది. తుది అనుమతికి వచ్చే వారం దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కన్సార్షియం క్లస్టర్‌ బిడ్డర్లు మొత్తం నగదు ప్రాతిపదికన బిడ్‌ చేయవలసి ఉన్నప్పటికీ ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ ప్రకారం వాయిదా పద్ధతిలో చెల్లింపులకు వీలు కల్పించనున్నట్లు తెలిపాయి. రిలయన్స్‌ క్యాప్‌ కార్పొరేట్‌ దివాలా రిజల్యూషన్‌ ప్రాసెస్‌ పూర్తిచేసేందుకు సీవోసీ 3 నెలల గడువును కోరవచ్చని వెల్లడించాయి.

మరిన్ని వార్తలు