రిలయన్స్‌ క్యాపిటల్‌ రిజల్యూషన్‌ గడువు పెంపు!

7 Apr, 2022 11:05 IST|Sakshi

న్యూఢిల్లీ: దివాలా చట్ట(ఐబీసీ) చర్య లలో ఉన్న రిలయన్స్‌ క్యాపిటల్‌ రుణ పరిష్కార(రిజల్యూషన్‌) ప్రణాళికకు మరింత గడువు లభించే వీలుంది. కంపెనీ రిజల్యూషన్‌ బిడ్స్‌పై బుధవారం(6న) రుణదాతల కమిటీ(సీవోసీ) చర్చించినట్లు తెలుస్తోంది.

ఐబీసీ నిబంధనల ప్రకారం పాలనాధికారి 180 రోజుల్లోగా రిజల్యూషన్‌ను ముగించవలసి ఉంటుంది. అంటే 2022 జూన్‌3 కల్లా పూర్తికావలసి ఉంది. అయితే మరో 90 రోజులు అదనపు గడువునిచ్చేందుకు సీవోసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వెరసి సెప్టెంబర్‌ 3వరకూ గడువు లభించే వీలుంది. అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ ఆర్‌క్యాప్‌ రుణ భారం, చెల్లింపుల వైఫల్యంతో దివాలా చట్ట పరిధికి చేరిన సంగతి తెలిసిందే.

కంపెనీ కొనుగోలుకి అదానీ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ లంబార్డ్, టాటా ఏఐజీ, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తదితర 54 సంస్థలు బిడ్స్‌(ఈవోఐ) దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.

మరిన్ని వార్తలు