రిలయన్స్‌ బ్రాండ్స్‌ చేతికి జివామే!

30 Nov, 2020 20:18 IST|Sakshi

సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఆన్‌లైన్ లోదుస్తుల సంస్థ జివామేను  సొంతం చేసుకుంది. యాక్టోసెర్బా యాక్టివ్ హోల్‌సేల్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు  రిలయన్స్‌  సోమవారం నాటి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ధృవీకరించింది. ఈ లావాదేవీ 2020 సెప్టెంబర్ 30 తో ముగిసిన మొదటి అర్ధ సంవత్సరంలో ముగిసిందని వెల్లడించింది.

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని అనుబంధ కంపెనీ రిలయన్స్‌ బ్రాండ్స్‌ యాక్టోసెర్బా యాక్టివ్ హోల్‌సేల్‌ను అసోసియేట్ కంపెనీగా పేర్కొంది.  దీంతో ఆర్‌ఐఎల్ 38 సంస్థలను అసోసియేట్ కంపెనీలను తన ఖాతాలో వేసుకుంది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ప్రకారం, ఈ కంపెనీలో 15 శాతం వాటాను కొనుగోలు చేసింది. జూలైలో, ఆర్‌ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్, జివామెలోని రోనీ స్క్రూవాలా యాజమాన్యంలోని యునిలేజర్ వెంచర్స్ వాటాను కొనుగోలు చేసినట్లు తెలిపింది. కంపెనీ మొత్తం 15 శాతం వాటాను రిలయన్స్ బ్రాండ్స్‌కు అమ్మినట్లు స్క్రూవాలా  తెలిపారు.

2011లో  స్థాపితమైన బెంగళూరుకు చెందిన యాక్టోసెర్బా యాక్టివ్ హోల్‌సేల్, జివామే అని కూడా పిలుస్తారు. ఇది మహిళల కోసం ఆన్‌లైన్ లోదుస్తుల స్టోర్‌నునిర్వహిస్తుంది. స్టార్టప్ యాక్టివ్‌వేర్, స్లీప్‌వేర్,  షేప్‌వేర్ వంటి ఇతర విభాగాలలోకి ప్రవేశించింది. జివామే వెబ్‌సైట్ ప్రకారం, ఇది 30-ప్లస్ రిటైల్ దుకాణాలను కలిగి, దేశవ్యాప్తంగా 800 కి పైగా భాగస్వామి దుకాణాలనుకలిగిఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ .32 కోట్లతో పోలిస్తే 2019 మార్చి నాటికి కంపెనీ రూ .19.5 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయగా, రూ .140 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

మరిన్ని వార్తలు