ఆ యూకే కంపెనీతో డీల్‌.. పుకార్లతో షేర్ల రయ్‌! రిలయన్స్‌ రియాక్షన్‌ ఇది

30 Nov, 2021 15:45 IST|Sakshi

దేశ టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో (Reliance Jio) తన జెండాను రెపరెపలాడించింది. ఈ నేపథ్యంలో తర్వాతి అడుగుగా విదేశీ మార్కెట్లపై రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) దృష్టిసారించిందనే వార్త సోమవారం అంతా చక్కర్లు కొట్టింది.  బ్రిటన్‌లోని అతిపెద్ద కంపెనీ బీటీ గ్రూప్‌(BT Group) కోసం బిడ్‌ వేయనుందనేది ఆ వార్త సారాంశం.  

కొంతకాలం క్రితం రిలయన్స్ T-Mobile డచ్ యూనిట్‌ను కొనుగోలు చేయడానికి బిడ్‌ను వేసింది. అంతకు ముందు లండన్‌లోని ఐకానిక్ స్టోక్ పార్క్‌ను 57 మిలియన్ పౌండ్లతో కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ అండ్ బిటిల ఒప్పందంపై వార్తలు చర్చనీయాంశమయ్యాయి.  అయితే ఈ కథనాలను కొట్టిపారేసింది రిలయన్స్‌. ఇది పూర్తిగా నిరాధారమైన, ఊహాజనితమైన కథనమని పేర్కొంటూ ఓ ప్రకటన రిలీజ్‌ చేసింది. 

బీటీ అనేది ఫిక్స్‌డ్ లైన్ టెలికాం సేవల యూ‌కే  ఆపరేటర్. గత కొన్ని సంవత్సరాలుగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, ఐ‌పి టి‌వి, టెలివిజన్, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్, మొబైల్ సేవలను అందిస్తుంది, అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలకు అందిస్తుంది. బి‌టి స్టాక్ ఐదేళ్లలో 53% పడిపోయింది, 2020-21లో 11 సంవత్సరాల కనిష్టానికి చేరుకుంది. అయితే రిలయన్స్‌ బిడ్‌ కథనాలు నేపథ్యంలో ఒక్కసారిగా షేర్ల దూసుకుపోవడం విశేషం. 

ఇక రిలయన్స్‌కు చెందిన జియో ప్రస్తుతం భారత్‌లో అతిపెద్ద ఆపరేటర్‌గా ఉంది. ట్రాయ్‌ డాటా ప్రకారం..  సెప్టెంబర్‌, 2021 నాటికి 42.48 కోట్ల మొబైల్‌ సబ్‌ స్క్రయిబర్స్‌ ఉన్నారు జియోకి. ఇక ఈమధ్యే ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియాతో పాటు జియో కూడా టారిఫ్‌లను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు