రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలెక్ట్రానిక్స్’ ఆఫర్లు 

10 Nov, 2020 21:03 IST|Sakshi

సాక్షి,ముంబై: దీపావళి సందర్భంగా రిలయన్స్‌ డిజిటల్‌  బంపర్‌ ఆఫర్లను ప్రకటించింది. ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్  పేరుతో  స్పెషల్‌ డిస్కౌంట్లను  అందిస్తున్నది. కస్టమర్లకు విస్తృత శ్రేణిలోని ఎలక్ట్రానిక్స్  కొనుగోళ్లపై సాటిలేని డీల్స్  అందిస్తోంది.  వివిధ కేటగిరీలలో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోఉంటాయి. ఈ  ప్రత్యేక సేల్‌ ఈ నెల( నవంబరు) 16వ తేదీవరకు అందుబాటులోఉంటుంది. రిలయన్స్ డిజిటల్ నుంచి ఈ పండుగకు బహుమతిగా షాపర్లకు రూ. 1000  వరకు విలువైన వోచర్లు లభిస్తాయి. అంతేకాదు ఇన్‌స్టా డెలివరీ (3 గంటలలోపు డెలివరీ)  స్టోర్ పిక్-అప్ కోసం ఎంపికలు ఉన్నాయి. కాబట్టి, మీ వస్తువును బుక్ చేసుకోవచ్చు 

ఆఫర్ల వివరాలు 

  • ఆన్ లైన్ షాపింగ్ లో  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐ  కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌ బ్యాక్‌ 
  • సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్  కోటక్ మహీంద్ర బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ , ఇఎమ్ఐ మీద రూ. 4500/- వరకు డిస్కౌంట్
  • అమెరికన్ ఎక్స్ ప్రెస్ కస్టమర్లు అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డుల మీద రూ. 2000/- ఫ్లాట్ డిస్కౌంట్ 
  • రిలయన్స్ డిజిటల్ నుంచి ఈ పండుగకు బహుమతిగా షాపర్లకు రూ. 1000/- వరకు విలువైన వోచర్లు
  •  శామ్సంగ్ గేలక్సీ S20 ఇప్పుడు హెచ్.డి.ఎఫ్.సి క్యాష్ బ్యాక్ చేర్చి రూ. 40,999/ డిస్కౌంట్
  •  శామ్సంగ్ గేలక్సీ వాచ్ ఎల్.టి.ఇ (42mm) హెచ్.డి.ఎఫ్.సి క్యాష్ బ్యాక్ చేర్చి రూ. 13,950/-* కి డిస్కౌంట్
మరిన్ని వార్తలు