16వేలకే శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్62

19 Feb, 2021 18:58 IST|Sakshi

ముంబయి: మొబైల్ తయారీ దిగ్గజం శామ్సంగ్ సంస్థ గెలాక్సీ సిరీస్ లో ఎఫ్62 మొబైల్ ను గత కొద్దీ రోజుల క్రితం తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో తీసుకొచ్చిన ఎఫ్-సిరీస్‌ గెలాక్సీ ఎఫ్41కు కొనసాగింపుగా శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎఫ్ 62 మోడల్ ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిలో ప్రధానంగా భారీ సామర్ధ్యం గల 7,000ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. మిడ్ రేంజ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్62లో ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ప్రత్యేకతలున్నాయి. 

శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్62 సేల్ ఫిబ్రవరి 22న ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ కి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనేవారికి రూ.2,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఆఫ్ లైన్ భాగస్వాములైన రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ వెళ్లి శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్62ను కొనుగోలు చేస్తే మీకు రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. మీకు మొదట రూ.3వేలు ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ లభించగా మొబైల్ కొన్న తర్వాత శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్62 మొబైల్ లో జియో సిమ్ వేసుకొని రూ.349పైన ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు రూ.7వేలు రూపాయలు వోచర్ రూపంలో లభిస్తాయి. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ తో రిలయన్స్ డిజిటల్ లో కొంటే రూ.5వేలు తగ్గే అవకాశం ఉంది.      

శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్
బ్యాటరీ: 7,000ఎంఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్: 25వాట్ 
ర్యామ్: 6జీబీ, 8జీబీ
స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్:  ఎక్సినోస్ 9825
బ్యాక్ కెమెరా: 64 ఎంపీ + 12 ఎంపీ + 5 ఎంపీ + 5 ఎంపీ
సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్
ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ 
కలర్స్: లేజర్ బ్లూ, లేజర్ గ్రీన్, లేజర్ గ్రే కలర్
ధర: 6జీబీ+128జీబీ - రూ.23,999
      8జీబీ+128జీబీ - రూ.25,999

చదవండి: జీఎస్‌టీ‌పై కేంద్రం కీలక నిర్ణయం?

              బంగారం కొనుగోలుదారులకు తీపికబురు

>
మరిన్ని వార్తలు