10 లక్షల ఉద్యోగులకు రిలయన్స్ ఉచిత వ్యాక్సిన్

26 Jul, 2021 20:22 IST|Sakshi

భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు అదేవిధంగా అసోసియేట్లు, భాగస్వాములకు కలిపి 10 లక్షలకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొంది. ‎రిలయన్స్ ఫౌండేషన్ ఏప్రిల్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ‎ఇప్పటి వరకు అర్హత కలిగిన మొత్తం ఉద్యోగుల్లో 98 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ కనీసం ఒక డోస్ తీసుకున్నారు.‎ అంతేగాకుండా, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కమ్యూనిటీలకు ఉచిత వ్యాక్సినేషన్ వేయడం ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. 

ఇందులో 'వి కేర్ ఇనిషియేటివ్' కింద అదనంగా 10 లక్షల మోతాదులు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ‎‎ఇది అతి పెద్ద ఉచిత కార్పొరేట్ వ్యాక్సినేషన్ కార్యక్రమం. ప్రస్తుత కరోనా సంక్షోభంపై పోరాడటానికి ఇది ఒక్కటే మార్గం. ‎గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా ఎమ్. అంబానీ సాధారణ సమాజానికి టీకాలు వేయదనీ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ‎"ఈ మిషన్ దేశవ్యాప్తంగా అమలు చేయడం ఒక అతిపెద్ద పని. ప్రతి భారతీయుడి భద్రత, రక్షణ మా వాగ్దానం" అని ఆమె చెప్పింది. ‎‎కోవిడ్-19 మహమ్మారి నుంచి రిలయన్స్ ఫౌండేషన్ అంతర్గత, బాహ్య సమాజాలను రక్షించే తమ సామాజిక బాధ్యత అని సంస్థ పేర్కొంది. 
 

మరిన్ని వార్తలు