ఫ్యూచర్‌ రిటైల్‌ రేసులో అంబానీ, అదానీ

12 Nov, 2022 04:14 IST|Sakshi

బిడ్డింగ్‌లో మొత్తం 13 కంపెనీలు

 న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ గ్రూప్‌లు సహా 13 కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) దాఖలు చేసిన కంపెనీల్లో ముకేశ్‌ అంబానీకి చెందిన  రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌), అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌.. ఫ్లెమింగో గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఏప్రిల్‌ మూన్‌ రిటైల్‌ కూడా ఉన్నాయి.

వీటితో పాటు క్యాప్రి గ్లోబల్‌ హోల్డింగ్స్, యునైటెడ్‌ బయోటెక్, ఎస్‌ఎన్‌వీకే హాస్పిటాలిటీ మొదలైన సంస్థలు ఉన్నట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో ఫ్యూచర్‌ రిటైల్‌ తెలిపింది. దివాలా ప్రక్రియ కింద కంపెనీ నుంచి  రూ. 21,060 కోట్ల మేర బకాయిలు రాబట్టుకునేందుకు ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా 31 బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు