రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో కీలక నిర్ణయం..!

15 Jul, 2021 22:16 IST|Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జస్ట్‌ డయల్‌ను కొనుగోలు చేయడానికి పావులు కదుపుతోంది. సుమారు 900 మిలియన్‌ డాలర్లతో జస్ట్‌డయల్‌ను సొంతం చేసుకునేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చర్చలు విజయవంతమైతే..జస్ట్‌ డయల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారుల డేటాబేస్ రిటైల్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ వేగంగా పుంజుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా గతంలో జస్ట్‌ డయల్‌ టాటాతో చర్చలు జరపగా, ఆ చర్చలకు జస్ట్‌ డయల్‌ ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది.

2021 మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో జస్ట్‌డయల్ నికర లాభం సంవత్సరానికి 55.9% (రూ. 33.6 కోట్లకు), ఆపరేటింగ్ ఆదాయం 25.2% తగ్గి 175.7 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం జస్ట్‌డయల్‌ విలువ రూ .2,387.9 కోట్లు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జస్ట్‌డయల్‌ను కొనుగోలు చేస్తోందన్న ఊహగానాలతో జస్ట్‌డయల్‌ స్టాక్ ధర గురువారం రోజున 2.5 శాతం పెరిగి రూ .1,107 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు