రిలయన్స్‌ భవిష్యత్‌ వ్యూహాలివే..

7 Sep, 2020 17:17 IST|Sakshi

ముంబై: దేశీయ టెలికాం రంగంలోకి సునామీలా దూసుకొచ్చిన ముకేశ్‌ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన హవాను కొనసాగిస్తుంది. అయితే రాబోయే నాలుగేళ్లలో రిలయన్స్‌ వ్యూహాత్మక ప్రణాళికలు అమలు చేయనున్నట్లు బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. ఆర్‌ఐఎల్‌(రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ‌) సంస్థ తమ ఆదాయాలను మరింత పెంచడానికి ఐపీఎల్‌, కేబీసీ తదితర సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. కాగా రాబోయే రోజుల్లో ఆర్‌ఐఎల్‌ సంస్థ ఎలక్ట్రానిక్స్, నిత్యావసర వస్తువుల విభాగంలో వినియోగదారులకు మరింత చేరువ చేయనుంది. ఈ నేపథ్యంలో 50 కోట్ల మొబైల్‌ వినియోగదారులను ఆకర్శించే విధంగా జియో వ్యూహాలు రచిస్తుంది.

ప్రస్తుతం జియోలో 38.8 కోట్ల యూజర్లు ఉన్నారు. కాగా రిలయన్స్‌ దూకుడైన నిర్ణయాలతో దిగ్గజ కంపెనీలు ఆర్‌ఐఎల్‌లో జత కట్టడానికి రెడీగా ఉన్నాయి. అయితే వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు స్థానిక కిరాణా విభాగంలో ప్రవేశించింది. ఇందుకుగాను సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సాప్‌ సమన్వయంతో కిరాణా స్టోర్స్‌ విభాగంలో దూసుకెళ్లాలని యోచిస్తుంది. (చదవండి: రోటీ, కపడా ఔర్ డేటా..జియోఫికేషన్)‌

మరిన్ని వార్తలు