అంబానీ కీలక నిర్ణయం: షేరు జంప్‌

1 Apr, 2021 14:04 IST|Sakshi

బ్యాంకు రుణం తీర్చేందుకు హెడ్‌ఆఫీసును విక్రయించిన అంబానీ

రూ. 1200 కోట్ల విలువచేసేభవనం విక్రయం

10 శాతం పెరిగిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేరు

సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న అనిల్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన ఆస్తిని విక్రయించారు. ప్రయివేటు రంగ బ్యాంకు యస్‌ బ్యాంకు అప్పు తీర్చే పనిలో భాగంగా  తన వేలకోట్ల ఆస్తిని అంబానీ విక్రయించారు. బ్యాంక్‌కి బకాయి పడిన కోట్ల రూపాయల అప్పుని తీర్చేందుకు ముంబైలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ముంబై ప్రధాన కార్యాలయం ‘రిలయన్స్ సెంటర్‌ను ’ను విక్రయించారు.ఈ పరిణామంతో స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు దాదాపు 9.50శాతం ఎగియడం విశేషం.

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా మార్కెట్‌ సమాచారంలో ఈ విషయాన్ని వెల్లడించింది. యస్‌ బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఉద్దేశించిన ఈ లావాదేవీ విలువ రూ .1200 కోట్లు అని తెలిపింది. ఈ అమ్మకంతో బ్యాంక్ ఇదే ఆఫీస్‌ని తన కార్పోరేట్ హెడ్‌క్వార్డర్స్‌గా మార్చుకోనుంది. కాగా 2021 జనవరిలోనే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 3 ఆస్తులను విక్రయించింది. ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ (3,600 కోట్ల రూపాయలకు) పర్బతి కోల్డామ్ ట్రాన్స్‌మిషన్ (900 కోట్ల రూపాయల)  అమ్మిన సంగతి తెలిసిందే.  (పెరుగుతున్న ఇళ్ల ధరలు, ఇంకా పెరగొచ్చు!)

చదవండి :  కేంద్రం యూటర్న్‌ : ఏప్రిల్‌ ఫూల్‌ జోకా?

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు