బిల్‌గేట్స్‌ సంస్థలో రిలయన్స్‌ పెట్టుబడులు

14 Nov, 2020 05:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కి చెందిన బ్రేక్‌థ్రూ ఎనర్జీ వెంచర్స్‌ (బీఈవీ)లో దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 50 మిలియన్‌ డాలర్ల దాకా ఇన్వెస్ట్‌ చేయనుంది. వచ్చే ఎనిమిది నుంచి పదేళ్ల వ్యవధిలో విడతలవారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్‌ వెల్లడించింది.

వాతావరణ మార్పు సమస్యలను టెక్నాలజీ సహాయంతో పరిష్కరించే మార్గాలు కనుగొనడంపై బీఈవీ కృషి చేస్తోంది. సమీకరించిన నిధులను పర్యావరణ అనుకూల ఇంధనాలు మొదలైన వాటిని ఆవిష్కరించేందుకు వెచ్చించనుంది. కొత్త ఆవిష్కరణలతో మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూరగలదని, ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు రాగలవని రిలయన్స్‌ తెలిపింది.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా