మహిళల కోసం అద్భుతమైన డైమండ్ నెక్లెస్ విడుదల చేసిన రిలయన్స్ జ్యువెల్స్

17 Dec, 2021 20:42 IST|Sakshi

భారతదేశ అగ్రగామి, విశ్వసనీయ జ్యుయలరీ బ్రాండ్ అయిన రిలయన్స్ జ్యువెల్స్ ఇప్పుడు సరికొత్త డైమండ్ కలెక్షన్లు, ఆఫర్లతో మన ముందుకొచ్చింది. ట్రెండీ వజ్రాభరణాలను తీసుకొచ్చింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను మరింత కలర్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు కేవలం రూ.49,999 నుంచి ప్రారంభమయ్యే, నమ్మశక్యం కాని ధరలో డైమండ్ నెక్లెస్ సెట్‌ల ఆకర్షణీయమైన పరిమిత ఎడిషన్ “డైమండ్ డిలైట్స్” వజ్రాభరణాలను విడుదల చేసింది.

అందమైన డైమండ్ డిలైట్స్ కలెక్షన్ ఆకర్షణీయమైన ధరలకు తీసుకొని వచ్చినట్లు తెలిపింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ డైమండ్ ఆభరణాలు భారతదేశవ్యాప్తంగా రిలయన్స్ జ్యువెల్స్ లలో లభ్యమవుతాయి. ప్రతీ సందర్భానికి, కాలానికి తగిన ఇందులో వజ్రాలున్నాయని రిలయన్స్ జ్యూయల్స్ తెలిపింది. వజ్రాభరణాలను సొంతం చేసుకోవడంపై, వాటిని ధరించడంపై మహిళలకు మక్కువ పెరిగింది. రిలయన్స్ జ్యువల్స్ ఈ నూతన డైమండ్ శ్రేణిని రూపొందించేందుకు అది కూడా ఓ ప్రధాన కారణం.

ఈ అభరణాలు రంగు, స్వచ్ఛత, క్యారెట్, కట్ విషయలలో అన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. సమకాలీన వినియోగదారుల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ డిజైన్లు రూపుదిద్దుకున్నాయి. పార్టీలు, వివాహాలకు సరైన ఎంపికగా ఇవీ నిలుస్తాయి. మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇవి గొప్ప ఎంపిక. ఇది పరిమిత ఎడిషన్ వజ్రాభరణాలు, స్టాక్‌లు ఉండే వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇందులోని అన్ని డైమండ్ సెట్‌లు ఐజీఐ సర్టిఫికేట్ పొందాయి. రిలయన్స్ జ్యువెల్స్ తన కస్టమర్‌లకు చాలా తక్కువ ధరలకు అద్భుతమైన వజ్రాలు గల డైమండ్ డిలైట్స్‌ వజ్రాభరణాలను ఎంచుకునే అవకాశాన్ని అందిస్తోంది.

(చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారులకు కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బంపర్ ఆఫర్..!)

మరిన్ని వార్తలు