జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌..! సరికొత్త ఒరవడితో ప్లాన్స్‌.!

28 Mar, 2022 15:00 IST|Sakshi

ప్రముఖ ప్రైవేట్‌ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన యూజర్లకు శుభవార్తను అందించింది. యూజర్లకు మరిన్ని ప్రయోజనాలు కలిగేలా సరికొత్త ఒరవడితో ప్లాన్స్‌ను తీసుకొచ్చింది జియో.

డేట్‌ టూ డేట్‌..!
రిలయన్స్‌ జియో తన యూజర్ల కోసం ‘క్యాలెండర్‌ మంత్లీ వ్యాలిడిటీ’ ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ను ప్రారంభించించినట్లు ప్రకటించింది. యూజర్ల కోసం సరికొత్త రూ. 259 ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌తో యూజర్లు డేట్‌ టూ డేట్‌ రిఛార్జ్‌ చేసుకునే సౌకర్యాన్ని పొందుతారు. సాధారణంగా అన్ని టెలికాం సంస్థలు 28, 56, 84 రోజులపాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్‌ను తమ యూజర్లకు అందిస్తున్నాయి. తాజాగా జియో పరిచయం చేసిన రీఛార్జ్‌ ప్లాన్‌తో  ఒక నెల పాటు వ్యాలిడిటీ పొందే అవకాశం ఉంది. ఎలాగంటే ఉదాహరణకు ఒక యూజరు మార్చి 28న రూ. 259 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే తిరిగి ఏప్రిల్‌ 28న రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా జియో తన యూజర్ల కోసం కస్టమర్‌ సెంట్రిక్‌ ఇన్నోవేషన్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే , రూ. 259 ప్లాన్‌ని ఒకేసారి అనేక సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. ముందస్తుగా రీఛార్జ్ చేయబడిన ప్లాన్ క్యూలో చేరి, ప్రస్తుత యాక్టివ్ ప్లాన్ గడువు ముగిసే తేదీన స్వయంచాలకంగా యాక్టివ్‌గా మారుతుంది.  ఈ ప్లాన్‌తో కచ్చితంగా క్యాలెండర్‌ నెలలో అపరిమిత డేటా, కాలింగ్‌ ప్రయోజనాలను ఆస్వాదించడానికి జియో అనుమతిస్తోంది. రూ. 259 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్‌, రోజుకు 100 SMSలను కూడా పొందుతుంది. ఈ ప్లాన్‌ను మైజియో యాప్‌ లేదా రిలయన్స్‌ జియో వెబ్‌సైట్‌లో రీఛార్జ్‌ చేసుకోవచ్చును. 

చదవండి: వొడాఫోన్‌ ఐడియా యూజర్లకు శుభవార్త..! జియో తరహాలో..!

మరిన్ని వార్తలు