Reliance Jio 5G: యూజర్లకు శుభవార్త, దేశంలో జియో 5జీ సేవలు ప్రారంభం

22 Oct, 2022 15:13 IST|Sakshi

రిలయన్స్‌ జియో దేశంలో 5జీ సేవల్ని అధికారికంగా ప్రారంభించింది. రెండు నెలల క్రితం రిలయన్స్‌ ప్రకటించినట్లుగానే..శనివారం హై స్పీడ్‌ టెలికం సర్వసుల్ని అందుబాటులోకి తెచ్చింది. 

రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాష్‌ అంబానీ రాజస్థాన్‌ రాష్ట్రం రాజసమంద్‌లో ఉన్న ప్రముఖ శ్రీనాథ్‌జీ ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభించారు. దీంతో ఈ ఏడాది దీపావళి నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా,చెన్నైలలో ఎంపిక చేసిన యూజర్లకు 4జీ కంటే 10 రెట్ల వేగంతో పనిచేసే 5జీ సేవల్ని వినియోగించుకునే సదుపాయం కలగనుంది. 

2023 డిసెంబర్‌ నాటికి
టెలికం సంస్థ రిలయన్స్‌ వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రతీ పట్టణం, తాలూకా ఇలా అన్నీ ప్రాంతాల్లో జియో సేవల్ని వినియోగంలోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆ సంస్థ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఆగస్ట్‌ 29న దేశంలో 5జీ నెట్‌ వర్క్‌ ప్రారంభం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే.  

చదవండి👉 జియో 4జీ సిమ్‌ వినియోగిస్తున్నారా? అయితే జియో 5జీ నెట్‌వర్క్‌ పొందండిలా!

మరిన్ని వార్తలు