-

నాలుగు ప్లాన్లను తొలగించిన జియో

17 Jan, 2021 17:12 IST|Sakshi

ముంబయి: రిలయన్స్ జియో రూ.99, రూ.153, రూ.297, రూ.594 గల జియోఫోన్ ప్లాన్‌లను తొలగించింది. కేవలం ఈ ఆఫర్ జియోఫోన్ 4జీ ఫీచర్ ఫోన్‌లు వినియోగిస్తున్న యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని గతంలో పేర్కొంది. అయితే మిగతా ప్లాన్ విషయంలో ఎటువంటి మార్పులు చేయలేదని సంస్థ పేర్కొంది . దీంతో పాటు ఐయూసీ చార్జీల నుంచి ఊరట కలిగించడానికి తమ వినియోగదారులకు 500 నాన్ జియో ఉచిత నిమిషాలను అందిస్తుంది. వీటితో పాటు ఈ ఉచిత నిమిషాలు అయిపోయాక ఐయూసీ రీచార్జ్ లు చేసుకోవడం ద్వారా ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవచ్చు.(చదవండి: అరచేతిలో ఇమిడే ప్రొజెక్టర్)

ప్రస్తుతం రూ.75, రూ.125, రూ.155, రూ.185 అనే నాలుగు జియోఫోన్ ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సంస్థ పేర్కొంది. ఈ నాలుగు ప్యాక్‌లు జియోఫోన్ ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లలో భాగం. జియోఫోన్ యొక్క రూ.75 ప్లాన్ కింద ప్రతి రోజు 100ఎంబీ 4జీ డేటాతో పాటు జియో నుంచి జియోకు, ల్యాండ్ లైన్ ఫోన్లకు ఉచిత అపరిమిత కాలింగ్, జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవడానికి 500 ఉచిత నిమిషాలు, 50 ఉచిత ఎస్ఎంఎస్ లను ఈ ప్లాన్ లో అందిస్తారు. వీటితో పాటు అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ వంటి ప్రత్యేకమైన జియో యాప్స్ కు ఉచిత కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అలాగే రూ.125 ప్లాన్ కింద ప్రతి రోజు 500ఎంబి డేటా, 10 ఉచిత ఎస్ఎంఎస్ లతో పాటు ఇతర ఆఫర్స్ కూడా అందుతాయి. జియో రూ.155 ప్లాన్ కింద ప్రతి రోజు 1జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. జియో రూ.185 మొబైల్ ప్లాన్ కింద ప్రతి రోజు 2జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు పొందనున్నారు. 
 

మరిన్ని వార్తలు