జియో యూజర్లకు గుడ్‌న్యూస్: ఐదు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌, ఆఫర్లేంటో చూడండి! 

13 Jun, 2023 19:12 IST|Sakshi

 సాక్షి, ముంబై:  ముఖేశ్‌ అంబానీకి చెందిన టెలికాం  దిగ్గజం  రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐదు కొత్త ప్లాన్‌లను లాంచ్‌ చేసింది. రూ.269 -రూ. 789మధ్య  వీటిని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆప్లాన్లలో జియో సావన్‌  ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను కూడా  పొందవచ్చు.

కొత్త జియో ప్లాన్‌లలో అపరిమిత డేటా, యాడ్-ఫ్రీ మ్యూజిక్, లిమిట్‌లెస్ డౌన్‌లోడ్‌లు, అత్యుత్తమ ఆఫ్‌లైన్ మ్యూజిక్ క్వాలిటీ, JioSaavn సబ్‌స్క్రిప్షన్‌తో జియో టూన్స్‌ ఫీచర్లను యాక్సెస్ ఉంటుంది.

ప్లాన్లు, ఆఫర్లు
రూ. 269 ప్లాన్ :ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. అపరిమిత, ఉచిత వాయిస్ కాలింగ్‌,  రోజుకు 1.5జీబీ డేటా, అలాగే రోజుకు 100SMSలు ఉచితం. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్‌ఎఫ్‌ సక్సెస్‌ జర్నీ)

రూ. 529 ప్లాన్ : రోజుకు 1.5GB  డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100SMS అందిస్తుంది. ప్లాన్ వాలిడిటీ 56 రోజులు.  ఇంకా  Jio సూట్ యాప్‌లకు యాక్సెస్ ఉచిత Jio Saavn సబ్‌స్క్రిప్షన్ (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్‌ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?)

రూ.589 ప్లాన్: 56 రోజుల వాలిడిటీతో వస్తున్న జియో రూ.589 ప్లాన్‌లో ప్రతిరోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS Jio సూట్ యాప్‌లకు ఉచిత యాక్సెస్ 

రూ.739 ప్లాన్: 84 రోజుల చెల్లుబాటు. రోజుకు  1.5జీబీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం  126 జీబీ డేటా. ఇంకా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 SMSలు ఉచితం.  JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలు.

రూ. 789 ప్లాన్: 84 రోజుల వాలిడిటీ. రోజుకు  2జీబీ  హై-స్పీడ్ డేటా. ఇంకా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 SMSలు ఉచితం.  JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.
 

మరిన్ని వార్తలు