జియో కమాల్‌: ప్రపంచంలోనే చీపెస్ట్‌ ఇంటర్నెట్‌ ప్యాక్‌.. కస్టమర్లకు పండగే!

15 Dec, 2021 13:51 IST|Sakshi

Reliance Jio Becomes the First Operator to Offer a Rs 1 Prepaid Plan with 100 MB Data Valid for 30 Days:  దేశీ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెర తీసింది. ప్రపంచంలోనే అ‍త్యంత కారుచౌక ధరకు ఇంటర్నెట్‌ ప్యాకేజీని అందిస్తోంది. మంగళవారం గప్‌చుప్‌గా ఈ ప్యాక్‌ను వాల్యూ కేటగిరీలో యాడ్‌ చేసింది జియో. 

ప్రీపెయిడ్‌ రీఛార్జిలో భాగంగా ఒక్క రూపాయికి వంద ఎంబీ ఇంటర్నెట్‌ డేటా అందిస్తోంది రిలయన్స్‌ జియో.  100 ఎంబీ 4జీ డేటా.. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.  ఈ డేటా అయిపోగానే.. 64 కేబీపీఎస్‌తో ఇంటర్నెట్‌స్పీడ్‌ అందుతుంది. అంటే.. వాట్సాప్‌లో సాధారణ టెక్స్ట్‌ మెసేజ్‌లు పంపుకోవచ్చన్నమాట.

ఈమధ్యకాలంలో టెలికాం నెట్‌వర్క్‌లు అన్నీ టారిఫ్‌లు పెంచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జియో వేసిన ఈ అడుగు కీలకమనే చెప్పాలి. ఇక వాటర్‌ ప్యాకెట్‌ ధర కంటే తక్కువకి.. అదీ కేవలం ఒక్క రూపాయికే ఇంటర్నెట్‌ ప్యాకేజీని అందించడం సంచలనంగా మారింది. ప్రపంచంలో ఇంత తక్కువ ధరకే డేటా ప్యాక్‌ను అందించిన ఘనత ఇప్పుడు రిలయన్స్‌కే దక్కింది. ఇదిలా ఉంటే 15రూ. 1 జీబీ డేటా అందిస్తున్న ప్యాక్‌ కంటే.. ఇలా ఒక్క రూపాయి ప్యాక్‌ ద్వారా 10రూ.తోనే వన్‌ జీబీ పొందే వీలు ఉంటుంది.  

ఇక జియో అందిస్తున్న ఈ 100 ఎంబీప్లాన్‌ డేటాప్లాన్‌.. అన్నేసి రోజుల వాలిడిటీతో  ఏ టెలికామ్‌ ప్రొవైడర్‌ అందించట్లేదు. పైగా 28 రోజుల వాలిడిటీ కాకుండా.. 30 రోజుల పరిమితితో ఇస్తోంది.  నేరుగా మైజియో యాప్‌ ద్వారా ఈ రీచార్జ్‌ వెసులుబాటును కూడా అందిస్తోంది రిలయన్స్‌ జియో.


చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు