వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో జియో ట్రూ 5జీ సేవ‌లు

10 Jan, 2023 17:16 IST|Sakshi

1 జీబీఎఎస్‌+వేగంతో అప‌రిమిత 5జీ డేటా, యూజ‌ర్ల‌కు ‘జియో వెల్కం ఆఫ‌ర్‌’

హైదరాబాద్:   ప్రముఖ టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను తెలంగాణ లోని వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్ లో  రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
 
జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి,ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుందని జియో తెలిపింది. జియో ట్రూ 5జీ పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.  చిట్ట‌చివ‌రి అడుగు వ‌ర‌కు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యం  మెరుగుపడుతుందని పేర్కొంది. 

తెలంగాణలో జియో ట్రూ 5జీని విస్తరిండం పట్ల  జియో తెలంగాణ సీఈఓ కే సీ రెడ్డి  సంతోషం ప్రకటించారు. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి  రానున్నాయని కంపెనీ తెలిపింది జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికిట్రూ-5జీని అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా  తెలంగాణను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు