త్వరలో జియో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్స్

2 Dec, 2020 14:49 IST|Sakshi

జియో ఈ నెలలో చవకైన 4జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. తన 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులను స్మార్ట్‌ఫోన్‌లకు తరలించే ప్రయత్నంలో భాగంగా రిలయన్స్ జియో చైనా ఫోన్ తయారీ సంస్థ వివోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ వివో వై-సిరీస్‌లో రానుందని ధర రూ.8 వేల రేంజ్‌లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. డిస్కౌంట్లు, ఒటిటి సబ్ స్క్రిప్షన్, వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్ మెంట్ వంటి ఆఫర్లతో జియో త్వరలో 'ఎక్స్‌క్లూజివ్' స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి జియో యోచిస్తుంది. దీనికి సంబందించిన అధికారిక సమాచారం లేనప్పటికీ, ఒక నివేదిక ప్రకారం జియో వీటిని తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో కేవలం రిలయన్స్ జియో సిమ్ కార్డు మాత్రమే పనిచేసే విధంగా రూపకల్పన చేస్తుంది.(చదవండి: గెలాక్సీ నోట్ ఫోన్లకు శాంసంగ్ స్వస్తి)
 
రిలయన్స్ జియో వివోతో పాటు కార్బన్, లావా మరియు ఇతర చైనా బ్రాండ్‌లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వివో ఈ మధ్యే వివో వై1ఎస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.7,990గా నిర్ణయించారు. అలాగే జియో టెక్ దిగ్గజం గూగుల్‌తో పొత్తు పెట్టుకుని తక్కువ ధర గల 4జీ ఫోన్‌లను వచ్చే ఏడాది తీసుకురావాలని జియో యోచిస్తోంది. రిలయన్స్ జియో 3000 నుంచి 4000 మధ్య తక్కువ ధర గల స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడానికి ఇంతక ముందు ఐటెల్ కంపెనీతో కలిసి పనిచేసింది. జియో ప్రధాన ప్రత్యర్థి అయిన భారతి ఎయిర్‌టెల్ కూడా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో భాగంగా లావా, కార్బన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎయిర్ టెల్ ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది.

మరిన్ని వార్తలు