నిన్న ఫేస్‌బుక్‌...నేడు.. అసలు ఏం జరుగుతోంది...!

6 Oct, 2021 14:49 IST|Sakshi

అక్టోబర్‌ 4 న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు ఏడు గంటలపాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. నానాఅవస్థల తరువాత తిరిగి ఆ సేవలు యధావిధిగా కొనసాగాయి.ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు  నిలిచిపోవడంతో యూజర్లు ఒక్కసారిగా అంధకారంలో ఉండిపోయారు. ఇప్పుడు కొంతమంది యూజర్లకు మరో తలనొప్పి వచ్చి పడింది. 

నిన్న ఫేస్‌బుక్‌..ఇప్పుడు జియో...!
భారత్‌లో అతి తక్కువ ధరలకే ఇంటెర్నెట్‌ సేవలను అందిస్తోన్న జియో నెట్‌వర్క్‌  పలు నగరాల్లో ఈ రోజు(అక్టోబర్‌ 6న) నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో వినియోగదారులు నెట్‌వర్క్‌లో సమస్యలు ఉన్నాయంటూ ట్విటర్‌లో #Jiodown పేరుతో ట్రెండ్‌ చేస్తున్నారు.పలువురు జియో యూజర్లు  డౌన్‌డిటెక్టర్‌లో నెట్‌వర్క్‌ డౌనైందని రిపోర్ట్‌చేశారు.  ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో డౌన్‌డిటెక్టర్‌కు గణనీయమైన రిపోర్టులు వచ్చాయి. ఇదిలా ఉండగా నెట్‌వర్క్ క్యారియర్ జియో  నుంచి ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ , ఇండోర్ వంటి పెద్ద నగరాల్లో చాలా మంది జియో నెట్‌వర్క్‌ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

ట్విటర్‌లో నెటిజన్ల అసహనం...! జియో స్పందన..
పలు ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్‌ సమస్యలు తీవ్రంగా ఉండడంతో యూజర్లు ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ట్వీట్‌లకు జియోకేర్‌  స్పందించింది. జియోకేర్‌ ఒక కస్టమర్‌కు స్పందిస్తూ... , “మేము ప్రస్తుతం మీ లొకేషన్‌లో కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నాము. మా టెక్నికల్‌ బృందం దానిపైనే పనిచేస్తోంది. వీలైనంత త్వరగా సేవలు పునరుద్ధరించబడతాయి. " అని ట్విటర్‌లో పేర్కొంది. 


చదవండి: గూగుల్‌ నుంచి ‘స్నోకోన్‌’, దాని వెనుక చరిత్ర ఏంటో తెలుసా ?

మరిన్ని వార్తలు