10 లక్షలకు పైగా డౌన్‌లోడ్లతో టాప్‌లో

24 Jul, 2020 17:17 IST|Sakshi

జియోమార్ట్‌ దూకుడు

10లక్షలకు పైగా డోన్‌లోడ్స్‌

ఆపిల్‌, గూగుల్‌ ప్లే స్టోర్లలో రెండు, మూడు స్థానాల్లో 

సాక్షి, ముంబై: రిలయన్స్‌కు చెందిన రీటైల్‌ ప్లాట్‌ఫాం జియోమార్ట్‌ డౌన్‌లోడ్లలో దూసుకుపోతోంది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్ల కోసం లాంచ్‌ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ యాప్‌ 10 లక్షలకు పైగా డౌన్‌లోడ్లను సాధించింది.  (జియో మార్ట్‌ దూకుడు: ఉచిత డెలివరీ)

దేశవ్యాప్తంగా 200 నగరాల్లో బీటా మోడ్‌లో ప్లాట్‌ఫామ్ లభ్యతను ఆర్‌ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్‌ అంబానీ ప్రకటించిన  కొన్ని రోజుల వ్యవధిలోనే జియోమార్ట్ ప్లాట్‌ఫాం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. యాప్‌  బ్రెయిన్‌ డేటా ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ ఆపిల్ యాప్‌స్టోర్‌లో రెండు, మూడు స్థానాలను ఆక్రమించి అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌ ఘనతను దక్కించుకుంది. ప్రస్తుతం, ఈ షాపింగ్ ప్లాట్‌ఫాం జియోమార్ట్‌ దేశవ్యాప్తంగా రోజువారీ రెండున్నర లక్షలకు పైగా ఆర్డర్‌లను పొందుతున్నట్టు సమాచారం. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ఆర్డర్‌ పరిధితో నిమిత్తం లేకుండా ఉచిత డెలివరీ అందిస్తోంది. అలాగే  చెల్లింపుల్లో సోడెక్సో మీల్‌ కూపన్లను కూడా  అంగీకరిస్తోంది.  దీంతో జియోమార్ట్‌కు భారీ ఆదరణ లభిస్తోందని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. (జియో మార్ట్‌ ఈ-కామర్స్‌ సేవలు షురూ)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు