ఎలక్ట్రానిక్స్‌ సెక్టార్‌లోకి రియలన్స్‌ ఎంట్రీ.. అమెరికా కంపెనీతో జాయింట్‌ వెంచర్‌

3 Mar, 2022 10:33 IST|Sakshi

ఏ పని చేపట్టినా పక్కా వ్యూహంతో గ్రాండ్‌గా మొదలు పెట్టి సక్సెస్‌ కొట్టడమనేది రిలయన్స్‌ స్టైల్‌. ఫ్యూచర్‌ ఫ్యూయల్‌గా చెప్పుకుంటున్న హైడ్రోజన్‌ ఫ్యూయల్‌పై ఇప్పటిగా భారీగా పెట్టుబడులు పెడుతూ గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తోంది. తాజాగా ఎలక్ట్రానిక్స్‌లోకి ఎంటర్‌ అవుతోంది రిలయన్స్‌.

రిలయన్స్‌ డిజిటల్‌ పేరుతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ స్టోర్లు ఈ గ్రూపు ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే వివిధ కంపెనీలకు చెందిన బ్రాండ్లనే ఇక్కడ విక్రయిస్తున్నారు తప్పితే రిలయన్స్‌కు అంటూ సొంత బ్రాండ్‌ లేదు. ఈ లోటును తీర్చే పనిలో పడ్డారు.

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ పరికరాల సంస్థ సాన్మినాతో రిలయన్స్‌ జట్టు కట్టింది. సాని​‍్మనా ఇండియాలో 50 శాతం షేర్లను రూ. 1670 కోట్లతో రిలయన్స్‌ కొనుగోలు చేసింది. ఇకపై ఈ రెండు సంస్థలు కలిసి భారత్‌లో సంయుక్తంగా ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఉపకరణాలు ఉత్పత్తి చేయనున్నాయి.

సన్మినాకు చెన్నైలో ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ ప్లాంటు ఉంది. తాజాగా కుదిరిన జాయింట్‌ వెంచర్‌ ప్లాన్స్‌ను అనుసరించి ఇదే ప్లాంటులో ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీని చేపడుతారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గటుగా ఇతర ప్రాంతాల్లోనూ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్లను నెలకొల్పుతామని రిలయన్స్‌ తెలిపింది.

భారత ప్రభుత్వ మేకిన్‌ ఇండియా స్ఫూర్తితో ఎలక్ట్రానిక్‌ సెగ్మెంట్‌లో ప్రవేశించినట్టు రిలయన్స్‌ తెలిపింది. దేశ అవసరాలకు తగ్గట్టు క్లౌడ్‌ కంప్యూటింగ్‌, 5జీ టెక్నాలజీ విస్తరణ, మెడికల్‌, హెల్త్‌కేర్‌, ఇండస్ట్రీయల్‌, క్లీన్‌టెక్‌, డిఫెన్స్‌, ఎయిరోస్పేస్‌ సెకార్టకు అవసరమై ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీపై ఫోకస్‌ చేస్తున్నామని రిలయన్స్‌ తెలిపింది.

జియో రాకతో ఇండియాలో ఇంటర్నేట్‌ యూసేజ్‌లో పెను మార్పులు సంభవించాయి. ఈ కామర్స్‌ రంగం పది మెట్లు పైకి చేరుకుంది. పేపర్‌లెస్‌ ట్రాన్సాక‌్షన్స్‌ పెరిగాయి. రిలయన్స్‌ రాక కారణంగా త్వరలో ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లోనూ ఇదే తరహా మార్పులు చూడవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

చదవండి: ఏ అండ్‌ టీలో రిలయన్స్‌ రిటైల్‌ పెట్టుబడులు 

మరిన్ని వార్తలు