Avoid Russian Fuel: రిలయన్స్‌ వెనకడుగు..! రష్యా ముడిచమురు మాకొద్దు..! కారణం అదే..!

17 Mar, 2022 17:18 IST|Sakshi

ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై అమెరికాతో పాటుగా, యూరప్‌దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ కల్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది.  రష్యాపై ఆంక్షల నేపథ్యంలో తమ ప్లాంట్ల కోసం రష్యా ముడిచమురు కొనుగోలు విషయంలో రిలయన్స్‌ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని కంపెనీకి చెందిన సీనియర్‌ అధికారి వెల్లడించారు. 

కొంతమేర ముడిచమురు సరఫరా రష్యా నుంచి వచ్చిన్నప్పటీకి..ఆంక్షల నేపథ్యంతో ఆ దేశ ముడిచమురును తిరస్కరించే అవకాశం ఉందని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ బిజినెస్‌ హెడ్‌ క్రాకర్‌ రాజేష్‌ రావత్‌ బుధవారం రోజున ఒక సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రిలయన్స్‌ తన రిఫైనరీ కాంప్లెక్స్‌ కోసం రష్యా యురల్స్‌ ముడిచమురును నేరుగా కొనుగోలు చేస్తోంది. రిఫైనరీలో సింహాభాగం మిడిల్‌ ఈస్ట్‌, అమెరికా నుంచి సేకరిస్తోంది. 

మార్కెట్‌ కంటే తక్కువ రేటుకే..!
ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, యూరప్‌ దేశాలు ఆంక్షలను విధించడంతో...చాలా దేశాలు రష్యా ముడిచమురు దిగుమతులకు స్వస్తి పలికాయి. దీంతో భారత్‌ లాంటి దేశాలకు రష్యా ముడిచమురుపై బంపరాఫర్‌ను ప్రకటించాయి. మార్కెట్‌ కంటే తక్కువ ధరకే క్రూడాయిల్‌ సప్లై చేస్తామని రష్యా వెల్లడించింది.దీంతో భారత ప్రభుత్వ రంగ ముడిచమురు సంస్థలు రష్యా క్రూడాయిల్‌ను కొనేందుకు సిద్దమయ్యాయి. ఇప్పటికే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 3 మిలియన్‌ బ్యారెల్స్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం 2 మిలియన్‌ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను కొనేందుకు ఒప్పందాలను చేసుకున్నాయి. కాగా పలు కారణాల నేపథ్యంలో రిలయన్స్‌ ముడిచమురు సేకరణలో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. 

చదవండి: రష్యా దెబ్బకు ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి..! రంగంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌...!
 

మరిన్ని వార్తలు