గ్రీన్‌ ఎనర్జీ దిశగా రిలయన్స్‌..! విదేశీ కంపెనీను కొనుగోలుచేసిన రిలయన్స్‌..!

10 Oct, 2021 14:35 IST|Sakshi

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ 44వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్‌ వచ్చే మూడేళ్లలో గ్రీన్‌ ఎనర్జీరంగంలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రీన్‌ ఎనర్జీ దిశగా రిలయన్స్‌ అడుగులు వేస్తోంది. రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ అక్టోబర్ 10న ఆర్‌ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను  771 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)  యాజమాన్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) చైనా నేషనల్ బ్లూస్టార్  కో లిమిటెడ్ నుంచి ఆర్‌ఈసీ సోలార్ హోల్డింగ్స్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. 
చదవండి: ఆగకుండా 1360 కిలోమీటర్ల ప్రయాణం..! టయోటా వరల్డ్‌ రికార్డు..!

హెటెరోజంక్షన్ టెక్నాలజీ (హెచ్‌జెటి) యాక్సెస్‌తో గ్లోబల్-స్కేల్ ఫోటోవోల్టాయిక్ సెల్స్‌ తయారీలో దిగ్గజ ప్లేయర్‌గా మారడానికి ఆర్‌ఐఎల్ పనిచేస్తోంది. 2030 నాటికి 100GW సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని రిలయన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది పునారుత్పాదక శక్తి విషయంలో భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్న 450GW సౌరశక్తికి మద్దతుగా నిలుస్తోందని కంపెనీ రిలయన్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్‌ఈసీ ప్రధాన కార్యాలయం నార్వేలో ఉంది. నార్త్‌ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి.

చదవండి: టెస్లా కంటే తోపు..! ఇప్పుడు హైదరాబాద్‌లో...

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు