'మెగా' జాక్ పాట్ కొట్టేసిన ముఖేష్‌ అంబానీ! పీఎల్‌ఐ పథకానికి రిలయన్స్‌ ఎంపిక!

18 Mar, 2022 16:08 IST|Sakshi

దేశీయంగా బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన రూ.18,100 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకానికి నాలుగు సంస్థలు ఎంపికయ్యాయి.  రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్, ఓలా ఎలక్ట్రిక్, హ్యుందాయ్‌ గ్లోబల్‌ మోటర్స్‌ కంపెనీ, రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ వీటిలో ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పీఎల్‌ఐ స్కీము కింద ఎంపికైన సంస్థలు..రెండేళ్ల వ్యవధిలోగా అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ) బ్యాటరీల తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దేశీయంగా తయారు చేసిన బ్యాటరీల అమ్మకాలపై అయిదేళ్ల పాటు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.

 

అమర రాజా బ్యాటరీస్,లూకాస్‌–టీవీఎస్‌ తదితర 10 కంపెనీలు పీఎల్‌ఐ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దరఖాస్తులకు గడువు జనవరి 14 కాగా, జనవరి 15న సాంకేతిక బిడ్లను తెరిచారు.

చదవండి: అంబానీ అదరహో..ఈసారి ఏకంగా!!

మరిన్ని వార్తలు