రిలయన్స్‌ ఓ2సీ వ్యాపారం వేల్యుయేషన్‌ 69 బిలియన్‌ డాలర్లు

19 Jul, 2021 05:04 IST|Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్తగా సోలార్, బ్యాటరీలు, హైడ్రోజన్, ఫ్యూయల్‌ సెల్స్‌ మొదలైన వాటిపై భారీగా ఇన్వెస్ట్‌ చేయనున్న నేపథ్యంలో కొత్త ఇంధన వ్యాపార విభాగం వేల్యుయేషన్‌ దాదాపు 36 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని బ్రోకరేజి సంస్థ బెర్న్‌స్టెయిన్‌ రీసెర్చ్‌ ఒక నివేదికలో తెలిపింది. అలాగే చమురు, రసాయనాల వ్యాపార విభాగం (ఓ2సీ) వేల్యుయేషన్‌ 69 బిలియన్‌ డాలర్లుగా ఉండవచ్చని వివరించింది. ఈ రెండింటి విలువ 100 బిలియన్‌ డాలర్ల పైగా ఉంటుందని బెర్న్‌స్టెయిన్‌ రీసెర్చ్‌ పేర్కొంది. రిటైల్, డిజిటల్‌ సర్వీసులు మొదలైనవన్నీ కూడా కలిపితే మొత్తం కంపెనీ విలువ 261 బిలియన్‌ డాలర్ల పైచిలుకు ఉంటుందని వివరించింది.  పలు చమురు కంపెనీలు .. కాలుష్యరహిత ఇంధన సంస్థలుగా మారేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాయని... కానీ రిలయన్స్‌ వ్యూహం భిన్నమైందని పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు