గూగుల్‌, ఫేస్‌బుక్‌తో రిల‌య‌న్స్ జ‌ట్టు

8 Mar, 2021 17:39 IST|Sakshi

రిటైల్ పేమెంట్స్ లైసెన్స్‌ కోసం టెక్ దిగ్గజం గూగుల్‌, ఫేస్‌బుక్ సంస్థ‌ల‌తో క‌లిసి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ(ఎన్‌యూఐ)ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దేశీయంగా డిజిట‌ల్ పేమెంట్స్ మార్కెట్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేజ్(యూపీఐ) మాదిరిగానే వాటా పొందేందుకు రిల‌య‌న్స్ ఆసక్తి కనబరుస్తుంది. దీనికోసం రిల‌య‌న్స్‌, గూగుల్‌, ఫేస్‌బుక్ సంస్థ‌లు సో హమ్ భార‌త్ అనుబంధ సంస్థ ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ లిమిటెడ్ సంస్థ‌తో కలిసి ఎన్‌యూఐ లైసెన్స్ కోసం భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. 

ఈ బృందంలో గూగుల్‌, ఫేస్‌బుక్ తక్కువ వాటాను కలిగి ఉన్నాయి. దేశ డిజిట‌ల్ ఎకాన‌మీని బ‌లోపేతం చేయ‌డానికి త‌మ బృందం ఒక ప్లాన్‌ను ఆర్బీఐకి సమర్పించినట్లు తెలుస్తుంది. భారతదేశంలో యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు విజయవంతం కావడంతో ఆర్బీఐ 2020 ఆగస్టులోఎన్‌యూఐ బిడ్లను ఆహ్వానించింది. ఆర్‌బిఐ ఇటీవల ఎన్‌యుయు దరఖాస్తుల గడువును మార్చి 31, 2021కు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరు నెలల్లో సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రతిపాదనలను అధ్యయనం చేస్తుంది. రిలయన్స్‌తో పాటు టాటా గ్రూప్, అమెజాన్‌-ఐసీఐసీఐ బ్యాంక్‌-యాక్సిస్ బ్యాంక్‌, పేటీఎం-ఓలా-ఇండ‌స్‌లాండ్ బ్యాంక్ వేర్వేరుగా ఎన్‌యూఐల కోసం ఆర్బీఐకి ద‌ర‌ఖాస్తులు చేసేందుకు సిద్ధం అయ్యాయి.

చదవండి:

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట

రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌!

మరిన్ని వార్తలు