Reliance: ఐపీఎల్‌పై కన్నేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌...!

9 Aug, 2021 15:29 IST|Sakshi

కరోనా కారణంగా ఐపీఎల్‌-14 మధ్యలోనే అంతరాయం ఏ‍ర్పడిన సంగతి తెలిసిందే. మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. ఇప్పటికే ఐపీఎల్‌-14 షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఐపీఎల్‌-14 మ్యాచ్‌లను ప్రస్తుతం స్టార్‌​ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేస్తోంది. వచ్చే ఏడాది నుంది ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ను డీల్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దక్కించుకోవడం కంపెనీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

బ్రాడ్‌ కాస్టింగ్‌పై కన్సేసిన రిలయన్స్‌..!
ఐపీఎల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ను  స్టార్‌స్పోర్ట్స్‌  ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఏడాదితో ఐపీఎల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కాంట్రాక్ట్‌ ముగియనుంది. దీంతో ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. నెట్‌వర్క్‌ గ్రూప్‌-18, రిలయన్స్‌ జియో భాగస్వామ్యంతో ఐపీఎల్‌ మ్యాచ్‌లను బ్రాడ్‌ కాస్టింగ్‌ హక్కులను పొందాలని రిలయన్స్‌ భావిస్తోంది.

మొదలైన రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌..!
ఐపీఎల్‌తో పాటు ఇతర స్పోర్ట్స్‌ను బ్రాడ్‌ కాస్టింగ్‌ చేసే ఏర్పాట్లలో భాగంగా అందుకు సంబంధించిన పనులను ఇప్పటికే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. సొంత బ్రాడ్‌ కాస్టింగ్‌ టీంను కూడా రెడీ చేయనుంది. కాగా ఇతర బ్రాడ్‌కాస్టింగ్‌ నెట్‌వర్క్‌లో పనిచేసే టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లను రిలయన్స్‌ రిక్రూట్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల ‍‍క్రితం డిస్నీ-హాట్‌స్టార్‌ ఎస్‌వీపీ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ అడ్వర్‌టైజింగ్‌ ఛీఫ్‌ గుల్షన్‌ వర్మ రిసేంట్‌గా జియో యాడ్స్‌ సీఈవోగా బాధ్యతలను చేపట్టారు. ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్‌ నెట్‌వర్క్‌కు చెందిన మరో యాడ్స్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కూడా రిలయన్స్‌ కంపెనీలో చేరేందుకు  చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై నెట్‌వర్క్‌-18 అధికారికంగా స్పందిచలేదు.

నెట్‌వర్క్‌-18 బ్రాడ్‌ కాస్టింగ్‌ సంస్థను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కలిగి ఉన్న విషయం తెలిసిందే. గతంలో రిలయన్స్‌ ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కుల కోసం వేలంలో కూడా పాల్గొంది. ఇండియన్ ఎస్‌వీఓడీ మార్కెట్‌పై మీడియా పార్టనర్స్ ఆసియా (MPA) ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం.. డిస్నీ, అమెజాన్, ఫేస్‌బుక్, జియో, సోనీ ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకోవాలని చూస్తున్నాయి. 2022 వరకు ఐదు సంవత్సరాల పాటు ఐపీఎల్ మీడియా హక్కులను సొంతం చేసుకోవడానికి స్టార్ ఇండియా 16347.5 కోట్ల రూపాయలను చెల్లించింది. ఇది ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం మొదటి 10 సంవత్సరాల కోసం సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా చెల్లించిన దాని కంటే దాదాపు రెట్టింపు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు