రిలయన్స్‌ చేతికి జస్ట్‌ డయల్‌!

2 Sep, 2021 20:28 IST|Sakshi

ముంబై: దేశీయ ఆన్‌లైన్‌ కామర్స్‌ మార్కెట్‌లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌) అడుగులు వేస్తుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ పై నియంత్రణ తీసుకున్నట్లు తెలిపింది. లోకల్‌ సెర్చి ఇంజిన్‌ జస్ట్‌ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. ఇంతకు ముందు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్ట్‌డయల్‌ వ్యవస్థాపకుడు వీఎస్‌ఎస్‌ మణి ఇకపైనా మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని ఆర్‌ఆర్‌వీఎల్‌ తెలిపింది.

రిలయన్స్ రిటైల్ ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపిన ఒక ప్రకటనలో.. ఆర్‌ఆర్‌వీఎల్, జస్ట్‌డయల్, వీఎస్‌ఎస్‌ మణి, ఇతరుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.1,022.25 రేటు చొప్పున ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఆర్‌ఆర్‌వీఎల్‌కు కేటాయించినట్లు తెలిపింది. అలాగే వీఎస్‌ఎస్‌ మణి నుంచి షేరు ఒక్కింటికి రూ.1,020 రేటు చొప్పున ఆర్‌ఆర్‌వీఎల్‌ 1.31 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. జస్ట్ డయల్ అనేది భారతదేశంలోని ప్రముఖ లోకల్‌ సెర్చి ఇంజిన్‌ ఫ్లాట్ ఫారం. ఇది టెలిఫోన్ మరియు టెక్ట్స్ ద్వారా వెబ్ సైట్లు, యాప్ లు వంటి బహుళ ఫ్లాట్ ఫారాల ద్వారా దేశవ్యాప్తంగా యూజర్లకు సెర్చ్ సంబంధిత సేవలను అందిస్తుంది.(చదవండి: వాట్సాప్‌కు ఐర్లాండ్‌ భారీ షాక్‌...!)

మరిన్ని వార్తలు