45 శాతం పెరిగిన రిలయన్స్ జియో నికర లాభం

23 Jul, 2021 20:57 IST|Sakshi

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) జూన్ 30తో ముగిసిన ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రూ.12,273 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది లాభంతో పోలిస్తే మాత్రం 7.25 శాతం పతనాన్ని నమోదు చేసింది. సంస్థ‌లో ప్ర‌ధాన‌మైన రిల‌య‌న్స్ రిటైల్‌, రిల‌య‌న్స్ జియో ఆరోగ్యకరమైన టాప్ లైన్ వృద్ధిని క‌న‌బ‌ర్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక పనితీరుపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత లాభం రూ.13,233 కోట్ల(2020 మొదటి త్రైమాసికం) నుంచి రూ.12,273 కోట్లకు(1.65 బిలియన్ డాలర్లు) పడిపోయిందని తెలిపారు. 

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ కంపెనీ ఆదాయం ఏడాది క్రితం కాలంలో రూ.91,238 కోట్లతో పోలిస్తే చమురు నుంచి టెలికాం సమ్మేళన సంస్థ కార్యకలాపాల నుంచి ఆదాయం 58.2 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు ఆర్ఐఎల్ టెలికాం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ గత ఏడాది రూ.2,520 కోట్ల(45 శాతం) నుంచి రూ.3,501 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆర్ఐఎల్ చెందిన ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారం ఆదాయంలో 70 శాతానికి పైగా జంప్ చేయడంతో కంపెనీ ఆదాయం తిరిగి పెరగింది. 

"కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా అత్యంత సవాలుతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ కంపెనీ బలమైన లాభాలను అందుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. మా ఓ2సీ వ్యాపారంలో మేము మా ఇంటిగ్రేటెడ్ పోర్ట్ ఫోలియో, మెరుగైన ఉత్పత్తి ప్లేస్ మెంట్ సామర్థ్యాల ద్వారా బలమైన సంపాదనను సృష్టించాము. మా భాగస్వామి బిపితో పాటు, మేము కృష్ణ గోదావరి దిరుబాయి6(కేజీ డీ6) బేసిన్ లో శాటిలైట్ క్లస్టర్ ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచడం కొనసాగించాము. ఇది భారతదేశంలో గ్యాస్ ఉత్పత్తిలో 20 శాతం దోహదపడింది. ఇది మన దేశ ఇంధన భద్రతకు ప్రధాన దోహదం చేస్తుంది' అని ఆర్ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అంబానీ తెలిపారు. ఆర్ఐఎల్ షేరు ధర క్యూ1 నేడు 0.79 శాతం పడిపోయి రూ.2,104.00కు చేరుకుంది. అయితే, స్టాక్ మూడు నెలల్లో దాదాపు 12 శాతం, ఆరు నెలల్లో 3.7 శాతం పెరిగింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు