మరో రంగంలోకి రిలయన్స్‌ సునామీ: దిగ్గజాలకు దిగులే!

29 Aug, 2022 15:40 IST|Sakshi

సాక్షి,ముంబై: రిలయన్స్‌ జియో పేరుతో  టెలికాం రంగంలో సునామీ సృష్టించిన ఆయిల్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్‌ త్వరలోనే మరో రంగంలో ఎంట్రీ ఇస్తోంది. రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో భారీ వృద్ధి  తర్వాత ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్‌ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్‌ మెగా ఈవెంట్‌లో ప్రకటన వెలువడింది.

కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. హైక్వాలిటీ, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి, డెలివరీతో పాటు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్‌ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపారు .అలాగే కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపర్చే  ఉద్దేశంతో  2021లో ప్రారంభించిన WhatsApp-JioMart భాగస్వామ్యం ఎలా పనిచేస్తుందో ప్రదర్శించి చూపించారు.  

ఇషా అంబానీ ఇంకా ఏమన్నారంటే..
‘‘డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతిరోజూ దాదాపు 6లక్షలకు ఆర్డర్‌లు డెలివరీ చేస్తున్నాం. ఇది గత సంవత్సరం కంటే 2.5 రెట్లు పెరిగింది. 260కి పైగా పట్టణాల్లో డెలివరీ చేస్తున్న జియోమార్ట్ ఆన్‌లైన్ గ్రోసరీ ఇండియా నంబర్ వన్ విశ్వసనీయ బ్రాండ్‌గా రేట్  సాధించింది. 42 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మా స్టోర్ల సంఖ్యను 15,000కు పైగా పెంచడానికి ఈ ఏడాది 2,500 స్టోర్‌లను ప్రారంభించాం. స్టోర్ నెట్‌వర్క్ , మర్చంట్ పార్టనర్‌ల జోడింపు ద్వారా మరింత మంది కస్టమర్లు మా ఖాతాలో చేరుతున్నారు. రిలయన్స్ రిటైల్ రాబోయే ఐదేళ్లలో 7,500 పట్టణాలు, 3 లక్షల గ్రామాలకు సేవలందించాలనేది మా లక్ష్యం’’ అని ఇషా అంబానీ వెల్లడించారు. 

ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చే లక్క్ష్యంతో  ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్టు ఆమె తెలిపారు. అంతేకాదు భారతదేశం అంతటా గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు ఉత్పత్తి చేసే నాణ్యమైన వస్తువుల మార్కెటింగ్‌ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తద్వారా ఆయా కమ్యూనిటీలకు ఉపాధి, వ్యవస్థాపకత కోసం లాభదాయకమైన అవకాశాలను అందించడమే కాకుండా, సాంప్రదాయ భారతీయ కళాకారులు, ముఖ్యంగా మహిళల అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, వారి క్రియేటివిటీని సంరక్షించడంలో సహాయపడుతుందని భావిస్తున్నామన్నారు. తద్వారా రిలయన్స్ రిటైల్ హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే బ్రిటానియా వంటి ఎఫ్‌ఎంసిజి దిగ్గజాలకు గట్టి షాకే ఇవ్వనుంది.  

చదవండి:  Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి

'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో: ముఖేశ్‌ అంబానీ

మరిన్ని వార్తలు