మరో కంపెనీలో భారీగా వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్ రిటైల్!

20 Mar, 2022 20:53 IST|Sakshi

ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌ వెంచర్స్ లిమిటెడ్(ఆర్‌ఆర్‌వీఎల్) పర్పుల్ పాండా ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 89 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసింది. వాటాల కొనుగోలులో భాగంగా రిలయన్స్ రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టింది. పంకజ్ వర్మానీ, నేహా కాంత్ & సుమన్ చౌదరి 2013లో లాంఛ్ చేసిన క్లోవియా మహిళల ఇన్నర్ వేర్, లాంజ్ వేర్ తయారు చేయడంలో ఒక ప్రీమియం కంపెనీ. రిలయన్స్ ఇప్పటికే జీవామే, అమంటే వంటి బ్రాండ్లను కొనుగోలు చేసింది.

బీడీఏ పార్టనర్స్ క్లోవియాకు ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా వ్యవహరించగా, శార్దూల్ అమర్ చంద్ మంగళ్ దాస్ లీగల్ కౌన్సెల్'గా వ్యవహరించారు. "పంకజ్ వర్మాని, నేహా కాంత్, సుమన్ చౌదరి 2013లో ప్రారంభించిన క్లోవియా భారతదేశంలో ప్రముఖ బ్రిడ్జ్-టు-ప్రీమియం డీ2సీ బ్రాండ్" అని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. క్లోవియా కింద 3,500+ ప్రొడక్ట్ స్టైల్స్ ఉన్నాయి. 

(చదవండి: మీ ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోండి ఇలా..!)

మరిన్ని వార్తలు