జీ మీడియా, ఇన్వెస్కో వివాదంపై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్!

13 Oct, 2021 21:13 IST|Sakshi

జీ ఎంటర్ ప్రైజెస్, ఇన్వెస్కో మధ్య వివాదంలో రిలయన్స్ పేరు రావడంపై చింతిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రిలయన్స్ స్పష్టం చేసింది. జీ మీడియా సంస్థల్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ నుంచి వచ్చిన ఆఫర్ చాలా తక్కువ వ్యాల్యుయేషన్‌తో ఉందని జీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా షేర్ హోల్డర్లకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో రిలయన్స్ పేరు రావడంతో రిలయన్స్ స్పష్టతనిచ్చింది. 2021 ఫిబ్రవరి, మార్చిలో పునీత్ గోయెంకాతో తమ ప్రతినిధులు నేరుగా చర్చల్ని జరిపేందుకు ఇన్వెస్కో సహకరించిందని రిలయన్స్ తెలిపింది.

తక్కువ ధరకే జీతో మా మీడియా ఆస్తులను విలీనం చేయడానికి మేము విస్తృత ప్రతిపాదన చేసాము. జీ సంస్థలతో పాటు తమ సంస్థల్ని వ్యాల్యుయేషన్ చేసేందుకు ఒకే తరహా ప్యారామీటర్స్ ఫాలో అయ్యామని రిలయన్స్ తెలిపింది. ఈ ప్రతిపాదనను అన్ని విలీన సంస్థలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. జీ వాటాదారులతో సహా అందరికీ గణనీయమైన విలువను సృష్టించడానికి ప్రయత్నించామని రిలయన్స్ తెలిపింది. ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తోనే నిర్వహణను కొనసాగించడానికి రిలయన్స్ ఎప్పుడూ ప్రయత్నిస్తుందని, వారి పనితీరును బట్టి ప్రతిఫలం అందిస్తుందని తెలిపింది.(చదవండి: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధరెంతో తెలుసా?)

ఈ ప్రతిపాదనలో గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించాలన్న అంశం కూడా ఉందని, గోయెంకాతో పాటు టాప్ మేనేజ్‌మెంట్‌కు ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ESOPs) ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉందని రిలయన్స్ తెలిపింది. అయితే ప్రిఫరెన్షియల్ వారెంట్స్ ద్వారా వాటాలు పెంచుకోవాలని వ్యవస్థాపక కుటుంబం భావించడంతో గోయెంకాకు, ఇన్వెస్కోకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని రిలయన్స్ వివరించింది. అయితే మార్కెట్ కొనుగోళ్ల ద్వారా తమ పెట్టుబడులు పెంచుకోవచ్చని ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు. ఇన్వెస్కో, జీ వ్యవస్థాపకుల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ డీల్‌పై చర్చలు ముందుగు సాగలేదని రిలయన్స్ స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు