స్పోర్టీ లుక్ లో కొత్త రెనాల్ట్ డస్టర్

17 Aug, 2020 15:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఫ్రెంచ్ కార్ల తయారీదారు రెనాల్డ్  తన పాపులర్  కారులో రెనాల్ట్ డస్టర్ టర్బో 2020 మోడల్ కారును భారతదేశంలో లాంచ్ చేసింది. తమ కొత్త డస్టర్ ఎస్‌యూవీ మోడల్ ఇప్పుడు దేశంలో ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైనది నిలిచిందనీ,  ఆటోమోటివ్ మార్కెట్లలో  ఐకానిక్ హోదాను సాధించిందని కంపెనీ సీఈఓ వెంకట్రావ్ మామిళ్ల పల్లె ప్రకటించారు.

రెనాల్ట్ డస్టర్ టర్బో  వేరియంట్లు
1.3 లీటర్ బీఎస్-6- కంప్లైంట్ మోటర్ఇన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు సీఈటీ ఆప్షన్‌తో ఐదు వేరియంట్లలో లభిస్తుంది.1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్  ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎస్, ఆర్ఎక్స్ జెడ్ మోడళ్లను తీసుకురాగా, సీవీటిలో ఆర్ఎక్స్ఎస్ , ఆర్ఎక్స్ జెడ్ వేరియంట్లలో మాత్రమే లభించనుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో బేస్ మోడల్ రెనాల్ట్ డస్టర్ టర్బో మోడల్  ధర 10.49 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. సీవీటి వెర్షన్ ధరలు 12.99 లక్షలతో ప్రారంభం 1.5 లీటర్  పెట్రోల్ ఇంజన్ సామర్ధ్యంతో  లభిస్తున్న రెనాల్డ్ డస్టర్ ధరలు 8.59 లక్షల రూపాయలనుంచి 9.99  లక్షల మధ్య ఉండ నున్నాయి.

500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 154 బిహెచ్‌పి శక్తిని, 1,600 ఆర్‌పిఎమ్ వద్ద 254 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ ను అందిస్తుంది.  మాన్యువల్ వేరియంట్ లో ఇంధన సామర్ధ్యం లీటరు 16.5 కిలోమీటర్లు,  సీవీటీ మోడల్ కారు 16.42  కిలోమీటర్ల  ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.  రిమోట్ ప్రీ-కూలింగ్ ఫంక్షన్‌తో క్యాబిన్ ఆపిల్ కార్  ప్లే,  ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 7అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ లాంటి ఫీచర్లను  రెనాల్ట్ డస్టర్  టర్బోలో జోడించింది. 

మరిన్ని వార్తలు