మరో మైలురాయి దాటిన క్విడ్‌.. ఆరేళ్లలోనే వశమైన రికార్డు

20 Nov, 2021 17:03 IST|Sakshi

ఎంట్రీ లెవల్‌ కారుగా మార్కెట్‌లోకి వచ్చిన క్విడ్‌ మరో రికార్డును సొంతం చేసుకుంది. బడ్జెట్‌ కారుగా మార్కెట్‌లోకి వచ్చినా.. తర్వాత కాలంలో ప్రజలు ఇష్టమైన కారుగా ముద్ర పడిపోయింది. తాజాగా క్విడ్‌ మరో మైలు రాయిని దాటింది. 

2015 నుంచి
ఫ్రెంచ్‌ కారు తయారీ కంపెనీ రెనాల్ట్‌ లైనప్‌లో ఎంట్రీ లెవల్‌ కారుగా రెనాల్ట్‌ది ప్రత్యేక స్థానం. మొదటిసారిగా 2015లో ఈ కారుని ఇండియాలో లాంఛ్‌ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వాటిని దాటుకుంటూ అనతి కాలంలోనే ఇండియాలో బెస్ట్‌ సెల్లింగ్‌ కార్లలో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2019లో క్విడ్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ని రెనాల్ట్‌ మార్కెట్‌లోకి తెచ్చింది.

నాలుగు లక్షలు
రెనాల్ట్‌ కారు ఇండియా మార్కెట్‌లోకి వచ్చి సుమారు ఆరేళ్లు అవుతోంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల క్విడ్‌ కార్లను అమ్మినట​‍్టు రెనాల్ట్‌ ప్రకటించింది. నాలుగో లక్ష కారును కొనుగోలు చేసిన యజమానికి రెనాల్ట్‌ ఇండియా సేల్స్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుధీర్‌ మల్హోత్ర స్వయంగా హ్యాండోవర్‌ చేశారు. 2022 సెప్టెంబరులో క్విడ్‌లో మరో వెర్షన్‌ రాబోతున్నట్టు కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బడ్జెట్‌ ఫ్రెండ్లీ
అత్యాధునిక ఫీచర్లతో బడ్జెట్‌ ధరలో అందుబాటులో ఉండటం వల్ల క్విడ్‌ ఇండియా మార్కెట్‌లో సుస్థిర స్థానం దక్కించుకోగలిగింది. ఎంట్రీ లెవల్‌ క్విడ్‌ కారులో 800 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజన్‌ 54 హెచ్‌పీ సామర్థ్యంతో  72 ఎన్‌ఎం టార్క్‌ని రిలీజ్‌ చేస్తుంది. హైఎండ్‌లో 91 ఎన్‌ఎం టార్క్‌ రిలీజ్‌ చేస్తుంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ఈ కారు ధర రూ.4.11 లక్షల నుంచి రూ. 5.59 లక్షల వరకు ఉంది. 

అధునాత ఫీచర్లు
టచ్‌స్ర్కీన్‌ ఇన్ఫోంటైన్‌మెంట్‌, యాపిల్‌ కార్‌ ప్లే, డ్యూయల్‌ ఎయిర్‌ ఫ్రంట్‌ బ్యాగ్స్‌, ఏఈబీఎస్‌ విత్‌ ఈబీడీ,  రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్‌ వంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి. రెడిన్‌ డాట్సన్‌ గో, హ్యుందాయ్‌ సాంత్రో, మారుతి సూజుకి ఎస్‌ప్రెసో కార్లకు ధీటుగా క్విడ్‌ ఇక్కడి మార్కెట్‌లో పట్టు సాధించింది.

చదవండి:2023లో మార్కెట్లోకి సోలార్ కారు.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ?

మరిన్ని వార్తలు