రెనో క్విడ్‌ నియోటెక్‌ ఎడిషన్‌ ఆవిష్కరణ

3 Oct, 2020 08:16 IST|Sakshi

సాక్షి, ముంబై: రెనో ఇండియా క్విడ్‌ నియోటెక్‌ పేరుతో లిమిటెడ్‌ ఎడిషన్‌ లాంచ్‌ చేసింది. ఈ క్విడ్‌కు మంచి డిమాండ్‌ ఉంటుందని రెనో ఆశిస్తోంది. ఈ మోడల్‌  మూడు వేరియంట్లలో విడుదల కానుంది. 800 సీసీ, 1.0 లీటర్‌ మాన్యువల్, 1.0 లీటర్‌ ఏటీఎంల రూపంలో లభ్యమయ్యే ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.4,29,800 రూ.4,51,800, రూ.4,83,800 గా ఉన్నాయి. ఈ స్పెషల్‌ ఎడిషన్‌ రెండు డ్యూయల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్లలో లభ్యం కానుంది. దీని ఇంజిన్‌ 0.80 లీటర్‌ యూనిట్, 1.0 లీటర్‌ యూనిట్‌ ఆప్షన్లలో ఉన్నాయి. ఇందులో 0.80 లీటర్‌ యూనిట్‌ 53 బీహెచ్‌పీ శక్తిని, 72 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. మరొకటి 1.0 లీటర్‌ యూనిట్‌ 67 బీహెచ్‌పీ శక్తిని, 91 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. వీటితో పాటు స్టాండర్డ్‌ 5–స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ ఇందులో ఉంది. అక్టోబర్‌ 1న బుకింగ్స్‌ మొదలయ్యాయి. డెలివరీలు తొందర్లోనే ప్రారంభమవుతాయి. పండుగ సీజన్‌ సందర్భంగా కంపెనీ బ్రాండ్‌ శ్రేణి ధరల్ని స్వల్పంగా పెంచింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు