బంపరాఫర్‌..! కారు కొనుగోలుపై ఏకంగా రూ. లక్షకు పైగా తగ్గింపు..!

9 Apr, 2022 22:02 IST|Sakshi

ప్రముఖ ఫ్రెంచ్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనాల్ట్‌ పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. రెనాల్ట్‌ పోర్ట్‌ఫోలియోలోని పలు కార్లపై ఏకంగా రూ. లక్షకు పైగా తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బోనస్‌లు , కార్పొరేట్ డిస్కౌంట్స్‌గా కొనుగోలుదారులకు లభించనున్నాయి. 

రెనాల్ట్‌ అందిస్తోన్న డిస్కౌంట్ ఆఫర్ల వివరాలు:

రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్‌ క్విడ్‌ పాత వెర్షన్‌ కార్‌పై రూ. 10,000 క్యాష్‌ డిస్కౌంట్‌ , కొత్త అప్‌గ్రేడ్ వెర్షన్‌పై రూ. 5,000 వరకు నగదు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. రెనాల్ట్ క్విడ్ కారుపై రూ. 38,000 వరకు లాయల్టీ బోనస్ ఉండనుంది. ఇతర  కారు ఎక్స్‌ఛేంజ్‌పై రూ. 15,000 ఉండనుంది.

రెనాల్ట్ ట్రైబర్, కైగర్‌.  
ఏప్రిల్‌ నెలలో కొన్ని రెనాల్ట్ ట్రైబర్‌కు సంబంధించిన పలు ట్రిమ్స్‌పై  రూ. 10,000 నగదు తగ్గింపుతో లభిస్తోంది. ఎక్సేచేంజ్‌ ఇన్వెంటివ్‌ రూ. 20,000, లాయల్టీ బోనస్‌ రూ. 44,000 వరకు అందిస్తోంది. రెనాల్ట్‌ కైగర్‌ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీపై రూ. 55,000 వరకు లాయల్టీ బోనస్‌ లభిస్తుంది.

రెనాల్ట్ డస్టర్
భారత్‌లో రెనాల్ట్‌ డస్టర్ నిలిపివేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీంతో డీలర్లు మిగిలిన స్టాక్‌పై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. రూ. 50,000 విలువైన నగదు తగ్గింపు, రూ. 50, 000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ కొనుగోలుదారులకు లభిస్తోంది.  అంతేకాకుండా రూ. 1.1 లక్షల లాయల్టీ బోనస్‌ కూడా అందుబాటులో ఉండనుంది. ఇక అన్నీ కార్ల స్క్రాపింగ్‌ పాలసీపై కొనుగోలుదారులకు రూ. 10,000 వరకు లభించనుంది. 

చదవండి: రూ. 1.2 కోట్ల జాక్‌పాట్‌..! ట్రిపుల్ఐటీ చరిత్రలోనే రికార్డు సృష్టించిన విద్యార్థి..!

మరిన్ని వార్తలు