Renault Rolls Out Discounts : రెనాల్ట్‌ కార్ల కొనుగోలుపై రూ.80 వేల వరకు బంపర్‌ ఆఫర్స్‌..!

20 Sep, 2021 17:16 IST|Sakshi

ఫ్రాన్స్‌కు చెందిన మల్టీనేషనల్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనాల్ట్‌ ఇండియా వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. రెనాల్ట్‌ శ్రేణిలోని కార్ల కొనుగోలుపై బంపర్‌ ఆఫర్లను కంపెనీ​ ప్రకటించింది. ఈ ఆఫర్స్‌ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. రెనాల్ట్ ఇండియా తన మోడల్ లైనప్‌లో  పలు ప్రయోజనాలను ప్రకటించింది. రెనాల్ట్‌ సుమారు రూ 80 వేల వరకు క్యాష్‌ బెనిఫిట్స్‌, లాయల్టీ బోనస్‌, కార్పొరేట్ డిస్కౌంట్లను అందించనుంది.
చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..!

రెనాల్ట్‌ అందిస్తోన్న ఆఫర్లు ఆయా మోడల్, ప్రాంతాల్లో మారుతూ ఉంటాయి. ‘బై నౌ, పే ఇన్‌ 2022’ అనే సరికొత్త  స్కీమ్‌తో రెనాల్ట్‌ ముందుకొచ్చింది. ఈ స్కీమ్‌ సెలక్టెడ్‌ కార్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ స్కీమ్‌లో భాగంగా తొలి ఆర్నెల్ల సమయంలో ఈఎమ్‌ఐ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే కారు కొన్న వెంటనే ఈఎమ్‌ఐ చెల్లించనక్కర్లేదు. రెనాల్ట్ తన RELi.VE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద సుమారు రూ. 10 వేల వరకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ క్విడ్ , ట్రైబర్ లేదా డస్టర్‌పై వర్తిస్తుంది.

రెనాల్ట్‌ క్విడ్‌

క్విడ్ హ్యాచ్‌బ్యాక్ సేల్‌లో రూ.40 వేల వరకు గరిష్ట ప్రయోజనాలతో అమ్మకానికి ఉంది. ఈ ఆఫర్‌లలో పదివేల వరకు క్యాష్ డిస్కౌంట్, 20 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, పదివేల వరకు కార్పొరేట్‌ బోనస్‌ ఉన్నాయి. 

రెనాల్ట్‌ ట్రైబర్‌

ట్రైబర్ ఎమ్‌పీవీపై రెనాల్ట్‌ విభిన్న ప్రయోజనాలను అందిస్తోంది. రెనో 2020 మోడల్ ట్రైబర్‌పై కొనుగోలుదారులు సుమారు రూ.  60 వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో రూ. 25 వేల వరకు క్యాష్‌ బెనిఫిట్‌, రూ. 25 వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌,  రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్‌ ఉన్నాయి. 2021 మోడల్ ఇయర్ ట్రైబర్ కొనుగోలు చేసే కస్టమర్‌లు సుమారు రూ.  50 వేల వరకు ప్రయోజనాలను పొందుతారు. వీటిలో రూ. 15 వేల వరకు క్యాష్‌ బెనిఫిట్‌, రూ. 25 వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌,  రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్‌ ఉన్నాయి. 

రెనాల్ట్ డస్టర్

రెనాల్ట్ డస్టర్ కొనుగోలుపై సుమారు రూ. 80 వేల వరకు బెనిఫిట్స్‌ అందిస్తోంది. వీటిలో రూ. 30 వేల వరకు క్యాష్‌ బెనిఫిట్‌, రూ. 20 వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌,  రూ. 30 వేల వరకు కార్పొరేట్ బోనస్‌ ఉన్నాయి. ఈ మూడు మోడళ్లకు ‘ఇప్పుడు కొనండి 2022లో చెల్లించండి’ స్కీమ్‌ వర్తించనుంది. 
చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు